లండన్: ప్రపంచకప్ 2019 లక్ష్యంగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతోంది. కోచ్‌ల పర్యవేక్షణలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటగాళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నారు. అయితే నెట్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘టీమిండియాకు ఆరో బౌలర్ దొరికాడోచ్’, ‘ప్రపంచకప్‌లో కోహ్లి మరో అవతారం ఎత్తునున్నాడు’, ‘కేదార్ జాదవ్ అందుబాటులో లేకుంటే అతడి బౌలింగ్ కోటాను కోహ్లితో భర్తీ చేయించవచ్చు’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
నెట్స్‌లో విరాట్ కోహ్లి బౌలింగ్ ప్రాక్టీస్
కోహ్లి బౌలింగ్ చేస్తున్న వీడియోతో పాటు టీమిండియా ఆటగాళ్లకు సహాయక కోచ్ శ్రీధర్ ఫీల్డింగ్ డ్రిల్‌ను నిర్వహించిన మరో వీడియోను కూడా బీసీసీఐ షేర్ చేసింది. క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయడం, వికెట్లకు నేరుగా బంతిని వేయటం వంటివి ప్రాక్టీస్ చేశారు. అంతేకాకుండా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు చేసిన పొరపాట్లపై కోచింగ్ బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన ఓపెనర్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి పోరులో జూన్5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment