న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్ హాకీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య విడుదల చేసింది. మొత్తం 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. టీమిండియా పూల్ ‘సి’లో బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికాలతో ఉంది. భువనేశ్వర్‌లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీ ప్రారంభోత్సవ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్... దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. అనంతరం డిసెంబర్ 2న బెల్జియంతో, 8న కెనడాతో టీమిండియా పోటీపడుతుంది. నవంబరు 28 నుంచి డిసెంబర్ 9 వరకు లీగ్ పోటీలు, 12, 13 తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. ప్రతీ పూల్‌లోని టాపర్ నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడో స్థానంలో నిలిచిన జట్లు 10, 11 తేదీల్లో జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో తలపడి గెలిస్తేనే క్వార్టర్స్ బెర్త్ దక్కుతుంది. 15న సెమీస్, 16న ఫైనల్ జరుగనుంది.
ఏ పూల్‌లో ఎవరంటే...
పూల్ ‘ఎ’: అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్; పూల్ ‘బి’: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్, చైనా; పూల్ ‘సి’: భారత్, బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: నెదర్లాండ్స్, జర్మనీ, మలేసియా, పాకిస్తాన్.
పూల్ ‘సి’లో భారత్
Published Thu, Mar 1 2018 1:30 AM | Last Updated on Thu, Mar 1 2018 1:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment