
పారిస్: అథ్లెటిక్స్‌లో క్లిష్టమైన ఈవెంట్స్‌లో ఒకటైన పురుషుల డెకాథ్లాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 10 క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో ఫ్రాన్స్ అథ్లెట్ కెవిన్ మాయెర్ ఈ కొత్త రికార్డు సృష్టించాడు.
డెకాస్టర్ ఈవెంట్‌లో మాయెర్ 9,126 పాయింట్లు సాధించి స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డునూ తన పేరిట లిఖించుకున్నాడు. 2015లో అమెరికా ప్లేయర్ యాష్టన్ ఈటన్ (9,045 పాయింట్లు) నెలకొల్పిన రికార్డును మాయెర్ సవరించాడు.
Comments
Please login to add a commentAdd a comment