టి-20 ప్రపంచ కప్ ఫైనల్ హైలెట్స్ | World T20 cup final match highlights | Sakshi
Sakshi News home page

టి-20 ప్రపంచ కప్ ఫైనల్ హైలెట్స్

Published Mon, Apr 4 2016 10:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

టి-20 ప్రపంచ కప్ ఫైనల్ హైలెట్స్

టి-20 ప్రపంచ కప్ ఫైనల్ హైలెట్స్

ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా సాగిన టి-20 ప్రపంచ కప్ ఫైనల్ సమరంలో వెస్టిండీస్ చిరస్మరణీయ విజయం సాధించింది. చివరి ఓవర్లో విండీస్ బ్యాట్స్మన్ బ్రాత్ వైట్ వరసగా నాలుగు సిక్సర్లు సంధించడంతో ఇంగ్లండ్ను ఓడించి కప్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ విశేషాలు..

  • టి-20 ప్రపంచ కప్ను రెండుస్లారు గెలిచిన తొలి జట్టుగా విండీస్ రికార్డు సృష్టించింది
  • ఒకే ఏడాది అండర్-19, మహిళలు, పురుషుల విభాగాల్లో ప్రపంచ కప్ సాధించిన తొలి దేశంగా వెస్టిండీస్ మరో రికార్డు నెలకొల్పింది
  • బ్యాటింగ్లో అద్భుతంగా రాణించిన భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్'గా ఎంపికయ్యాడు
  • విండీస్ ఆటగాడు మార్లన్ శామ్యూల్స్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. 2012 టి-20 ప్రపంచ కప్ ఫైనల్లోనూ ఈ అవార్డు సాధించాడు. ఆ ఏడాది కూడా విండీస్ కప్ గెల్చుకుంది. తద్వారా టి-20 ప్రపంచ కప్ ఫైనల్ విజేత జట్టులో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెల్చుకున్న తొలి క్రికెటర్గా శామ్యూల్స్ ఘనత సాధించాడు
  • టి-20 ప్రపంచ కప్ ఫైనల్లో హాఫ్‌ సెంచరీ చేసిన తర్వాత వికెట్ తీసిన మూడో బౌలర్గా జో రూట్ నిలిచాడు
  • టి-20ల్లో కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద సిరీస్ అవార్డు అందుకోవడమిది నాలుగోసారి
  • పొట్టి ఫార్మాట్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన ఐదో బ్యాట్స్మన్ బ్రాత్వైట్
  • టి-20ల్లో విండీస్ కెప్టెన్ డారెన్ సామీ వరుసగా టాస్ గెలవడమిది పదో సారి. ఈ ఫార్మాట్లో అత్యధికసార్లు వరుసగా టాస్ గెలిచిన తొలి కెప్టెన్ అతనే.  
  • టి-20 మ్యాచ్ లక్ష్యసాధనలో చివరి ఓవర్లో అత్యధిక పరుగులు చేయడం ఇదే తొలిసారి. 19 పరుగులు అవసరం కాగా, బ్రాత్వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు
  • పొట్టి క్రికెట్లో 50 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన నాలుగో విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement