
భారత్‌లోనూ డబ్ల్యూడబ్ల్యూఈ!
న్యూఢిల్లీ: అమెరికాతో పాటు విశ్వవ్యాప్తంగా డబ్ల్యూడబ్ల్యూఈకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ ఆటకున్న క్రేజే వేరు. ఇప్పుడు ఈ ఆటను భారత్‌లోనూ ఆడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన 30 మందికిపైగా రెజ్లర్లు ఓ గ్రూపుగా ఏర్పడి డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలోనే వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. తమకు తాము ఫ్రీక్ ఫైటర్స్ రెజ్లింగ్‌గా పిలుచుకుంటున్న వీరంతా ఆజానుబాహులే కాకుండా మంచి శరీర ధారుడ్యం కలిగి ఉన్నారు.
‘ఈ క్రీడా ఏర్పాటుకు భారత్‌లో ఎవరూ ప్రయత్నించడం లేదు. స్టేడియాలతోపాటు సౌకర్యాలు కూడా లేవు. అయితే ఇందులో పాల్గొనేవారి ప్రాణాలకు చాలా రిస్క్ ఉంటుంది. ఫైట్స్ అన్నీ స్క్రిప్ట్ ప్రకారమే నడిచినా స్టంట్స్ మాత్రం డూప్లికేట్ కాదు. గాయాలకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది’ అని శిక్షకుడు మనీష్ కుమార్ తెలిపారు.