
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ కోచ్ ఆచంట శ్రీనివాసరావు, తెలంగాణ ప్లేయర్ సిక్కిరెడ్డిలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో శ్రీనివాసరావు ద్రోణాచార్య, బ్యాడ్మింటన్‌లో సిక్కిరెడ్డి అర్జున అవార్డులకు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment