యువరాజ్ సింగ్-గంగూలీ(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని హుందాగా వ్యవహరించమంటున్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. మరి గంగూలీ ఏమైనా పెద్ద తప్పు చేస్తే యువీ ఇలా క్లాస్ పీకాడా అనుకుంటే పొరపాటే. గంగూలీ చేసిన ఒక పోస్ట్‌కు ఇలా టీజ్ చేశాడు యువీ. ఇంతకీ కారణం ఏమిటంటే.. తన పాత జ్ఞాపకాల్ని మరోసారి నెమరువేసుకున్నాడు దాదా. 1996లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో తన టెస్టు అరంగేట్రంలో సాధించిన సెంచరీ ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గంగూలీ పంచుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో గంగూలీ సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఆ వెనకాల రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ గంగూలీ ఆనాటి ఫొటోనే షేర్ చేశాడు. వాటర్ మార్క్‌తో కూడిన ఫొటోను గంగూలీ పోస్ట్ చేసి అదొక చిరస్మరణీయమైన క్షణం అని క్యాప్షన్ ఇచ్చాడు. మరి దీనికి యువరాజ్ తనదైన శైలిలో ఆట పట్టించాడు. ప్రధానంగా ఒక ఏజెన్సీకి సంబంధించిన ఆ ఫోటోపై వాటర్ మార్క్‌ను యువీ ప్రస్తావించాడు.‘దాదా.. నువ్వు బీసీసీఐ ప్రెసిడెంట్‌వి. ప్లీజ్ దయచేసి హుందాగా ఉండు’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment