‘అనుష్క వదినా.. నన్ను సిఫార్సు చేయవా’ | Yuzvendra Chahal Commented on Anushka Sharmas Instagram video | Sakshi
Sakshi News home page

అనుష్క వదిన చెబితే వింటాడు

Published Sat, Apr 18 2020 10:39 AM | Last Updated on Sat, Apr 18 2020 11:20 AM

Yuzvendra Chahal Commented on Anushka Sharmas Instagram video - Sakshi

హైదరాబాద్‌: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ స్వయం ప్రకటిత బ్యాట్స్‌మన్‌ అనే విషయం తెలిసిందే. తన బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ కాపీ కొట్టారని, భారీ సిక్సర్లు కొట్టగలనని సరదాగా వ్యాఖ్యానిస్తుంటాడు. అయితే తనను ఏకంగా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా పంపించేవిధంగా సారథి విరాట్‌కోహ్లికి సిఫార్సు చేయాల్సిందిగా బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మను ఇన్‌స్టాలో అభ్యర్థించాడు. అంతేకాకుండా అనుష్క మాటను కోహ్లి తప్పకుండా వింటాడని, తనను టీమిండియా ఓపెనర్‌గా పంపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇంతకీ అసలు ముచ్చటేంటంటే?
‘కోహ్లి లక్షలాది ఫ్యాన్స్‌ ప్రేమతో పాటు మైదానాన్ని మిస్సవుతున్నాడని నాకనిపిస్తోంది. ప్రత్యేకించి కొంతమంది వినూత్నమైన ఫ్యాన్స్‌ను కూడా మిస్‌ అవుతున్నాడు(బాల్‌ గట్టిగా కొట్టమని కేకలు పెడుతూ చెప్పేవారు). అందుకే అతడికి ఆ అనుభవాన్ని కలిగిస్తున్నా’ అంటూ ‘ ఏయ్‌ కోలీ(కోహ్లి) చౌకా మార్‌.. చౌకా.. క్యా కర్రా’ అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది. కాగా, తన సతీమణి అల్లరికి కోహ్లి బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. 

అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోను అనుష్క తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. నెట్టింట్లో తెగ వైరల్‌ అయిన ఈ వీడియో ఒక్క రోజు వ్యవధిలో దాదాపు కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియోకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌నుంచి మొదలు అనేకమంది నటీనటులు రియాక్ట్‌ అయ్యారు. ఇక ఈ వీడియోకు కామెంట్‌ చేస్తూ చహల్‌ పైవిధంగా విజ్ఞప్తి చేశాడు. 

చదవండి:
ఏయ్‌ కోహ్లి.. చౌకా మార్‌!
కొత్త కొత్తగా ఉంటుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement