రోహిత్‌ను అమ్మాయిగా మార్చేశాడు..! | Yuzvendra Chahal Shares Rohit Sharma Changed Women Face Photo | Sakshi
Sakshi News home page

రోహిత్‌.. నువ్వు చాలా క్యూట్‌: చహల్‌

Published Thu, Jun 18 2020 4:31 PM | Last Updated on Thu, Jun 18 2020 5:09 PM

Yuzvendra Chahal  Shares Rohit Sharma Changed Women Face Photo - Sakshi

ముంబాయి: ఆన్‌లైన్‌ ప్రపంచంలో ఇప్పుడు రకరకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్‌ల సాయంతో మనల్ని మనం ఎలా అయిన మార్చుకోవచ్చు. ఈ యాప్‌ల సాయంతో చాలా మంది వాళ్ల స్నేహితులను వేరు వేరు అవతారాల్లోకి మారుస్తూ ఆట పట్టిస్తుంటారు. అమ్మాయిలను అబ్బాయిలుగా, అబ్బాయిలను అమ్మాయిలుగా మార్చి సరదాగా ఏడిపిస్తుంటారు. ఇక అలాంటి ఫోటోలు మన టీమిండియా క్రికెటర్లవి అయితే అభిమానులు చూపించే ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది.  తాజాగా టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ తన సహచర క్రికెటర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఫోటోను అమ్మాయిగా మార్చి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. (ఆ రెండింటిలోనూ ఆడాలని ఉంది: రోహిత్‌)

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఫోటోను అమ్మాయిగా ఎడిట్‌ చేసిన చహల్‌.. చాలా క్యూట్‌గా ఉన్నావ్‌ రోహిత శర్మ భయ్యా అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ఫోటోపై అభిమానులు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఒక అభిమాని అయితే రోహిత్‌ శర్మతో పాటు  చాలా మంది టీమిండియా క్రికెటర్ల ఫోటోలను అమ్మాయిలుగా మార్చి వారిలో ఎవరు బాగున్నారంటూ పోస్ట్ చేశాడు. ఇక చహాల్‌, రోహిత్‌ సరదా కొట్టుకుంటున్న ఫోటోలను ఒ​క నెటిజన్‌షేర్‌ చేశాడు. రోహిత్‌ చాలా అందంగా ఉన్నాడు అంటూ మరో కొంతమంది మెచ్చుకుంటున్నారు. (‘అతడి గురించి చెప్పాలంటే మూగబోతాను’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement