
జహీర్, షమీ అన్‌ఫిట్
ఢిల్లీ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలోనూ ప్రధాన పేస ర్లు జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ బరిలోకి దిగలేదు. తుది జట్టులో వీరిద్దరు లేకపోవడంపై అనేక సందేహాలు తలెత్తాయి. దాంతో ఢిల్లీ జట్టు మేనేజ్‌మెంట్ దీనిపై వివరణ ఇచ్చింది. వారిద్దరూ గాయాలనుంచి కోలుకోకపోవడంతోనే ఆడించడం లేదని, మరో కారణం ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘జహీర్, షమీ చిన్నపాటి గాయాలతో బాధపడుతున్నారు. వైద్యులు వారిని పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ ఆడే ఐదో మ్యాచ్‌కల్లా జహీర్ కోలుకునే అవకాశం ఉంది. షమీ ఎప్పుడు బరిలోకి దిగుతాడో అప్పుడే చెప్పలేం. వీరిద్దరు బరిలోకి దిగితే జట్టు బౌలింగ్ మరింత బలంగా మారుతుంది’ అని డేర్ డెవిల్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.