ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
హరారే: ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసింది. గ్యారీ విల్సన్ (88 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు ), ఎడ్ జాయ్‌స్ (88 బంతుల్లో 53; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం జింబాబ్వే 49 ఓవర్లలో 8 వికెట్లకు 222 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (72 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు), క్రెయిగ్ ఇర్విన్ (78 బంతుల్లో 60; 5 ఫోర్లు) జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌తో వెలింగ్టన్ మసకద్జా అరంగేట్రం చేశాడు. ఫలితంగా హామిల్టన్, విన్‌స్టన్ మసకద్జాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మూడో సోదరుడయ్యాడు. జింబాబ్వే తరఫున ముగ్గురు సోదరులు ఆడిన ఘనత ఈ కుటుంబానిదే కావడం విశేషం. మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.