
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం వెళ్లిన పర్యాటకులకు బుధవారం రాత్రి నల్లమల అటవీ ప్రాంతంలో పులి కన్పించింది. నాగర్‌కర్నూలు జిల్లా మన్ననూరు బీట్‌లోని గుండం అనే ప్రాంతం వద్ద రోడ్డు దాటుతున్న పులి కనిపించడంతో వాహనాలు ఆపి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు. పులి సంచారాన్ని రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఇన్‌చార్జి వినోద్ ధ్రువీకరించారు. గడిచిన 14 ఏళ్ల కాలంలో నల్లమలలో రోడ్డు దాటుతూ పులి కన్పించటం ఇదే తొలిసారి.
2004లో మన్ననూర్ శివారు అటవీ ప్రాంతంలోని కుంచోని మూలఆంజనేయస్వామి దేవాలయం మధ్య చివరిసారి రోడ్డుపై పులి కన్పించింది. ఇటీవల చేసిన పులుల లెక్కింపులో మన్ననూర్ ఎఫ్‌ఆర్వో శ్రీదేవితో కలిసి ‘సాక్షి’క్షేత్ర స్థాయి పరిశీలన చేసినప్పుడు గుండం ప్రాంతంలోనే పులి పాదముద్రలను, తాజా పెంటికను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment