విజయవాడ: కొత్త రాజధానిలో 98 కిలో మీటర్ల ఇన్నర్, 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, విశాఖ 11 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ కు కూడా పచ్చజెండా ఊపింది. గురువారం సాయంత్రం ఏపీ కేబినెట్ సమావేశమైంది. భేటీ పూర్తయిన తర్వాత పలు నిర్ణయాలు ప్రకటించింది. ఈ వివరాలను మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో స్క్వేర్ సిటి సెంటర్ నిర్మాణం చేసేందుకు ఆమోదం జరిగిందన్నారు. మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
విజయవాడ జక్కంపుడిలో 265 ఎకరాల్లో ఎకనామిక్‌సిటీ నిర్మాణానికి ఓకే చెప్పామని, విజయవాడ, గుంటూరు పట్టణ మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఏలూరు, ఒంగోలు, గుంటూరు, అనంతపురం, కర్నూలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు ఎస్‌పీవీ ఏర్పాటుచేయనున్నారు. ఈ భేటీ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు పర్యవసనాలపై మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెన్షన్లు కూడా ఇవ్వలేకపోయామని సీఎం, మంత్రులు కూడా అన్నట్లు సమాచారం. త్వరలో రూ.2వేల నోట్లు వస్తే పెన్షన్లు ముందుగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కొత్త రాజధానికి 98 కి.మీ, 186 కి.మీ ఔటర్
Published Thu, Dec 15 2016 7:51 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM
Advertisement
Advertisement