![విషజ్వరాల విజృంభణ: 20 మంది మృతి](/styles/webp/s3/article_images/2017/09/4/81470061308_625x300_0.jpg.webp?itok=z1XqkmzC)
విషజ్వరాల విజృంభణ: 20 మంది మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషజ్వరాలు విజృంభణతో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. విషజ్వరాల బారినపడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు మాసాల చిన్నారి మృతిచెందింది. ఇప్పటికే విషజ్వరాలతో గత ఐదు రోజుల్లో నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు.
మృతిచెందినవారి సంఖ్య మొత్తం 20 కి చేరినట్టు అధికారులు వెల్లడించారు. విషజ్వరాలపై అనంతపురంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించిన వైద్యసదుపాయాలు సరైన సమయంలో అందడం లేదంటూ అక్కడి ప్రాంతవాసులు వాపోతున్నారు.