సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని 53,020 హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా జనవరి చివరకు 42,169 హెక్టార్లకు మాత్రమే అందించగలిగినట్లు మంత్రి శివరాజ్ తంగడి తెలిపారు. విధానపరిషత్‌లో ఎమ్మెల్సీ అశ్వత్థనారాయణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రాబోవు ఏడాదిలో తొమ్మిది జిల్లాల్లోని 79 తాలూకాల్లో ఉన్న 1881 చెరువుల్లో పూడిక తొలగింపు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
త్వరలో నూతన పారిశ్రామిక విధానం
రాష్ట్రంలో త్వరలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి రానుందని మంత్రి ప్రకాశ్‌హుక్కేరి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలు రూపొందించినట్లు చెప్పారు. మంత్రిమండలి ఆమోదం తర్వాత ఈ నూతన విధానం అమల్లోకి వస్తున్నారు. దీని వల్ల రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు సరళంగా ఉండటమే కాకుండా పారదర్శకత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిశ్రామికవిధానం మార్చి 31తో ముగుస్తుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహికులకుప్రభుత్వం ఉత్తమ సదుపాయాలు, రాయితీలు అందజేస్తుందని అన్నారు.
ఏనుగు దంతాల ప్రదర్శన
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 9.5 టన్నుల ఏనుగు దంతాలు ఉన్నాయన్నారు. మైసూరు, శివమొగ్గలోని ప్రత్యేక గోదాముల్లో వీటిని సంరక్షిస్తున్నట్లు చెప్పారు. వీటిని కాల్చివేయనున్నట్లు వస్తున్న వదంతలు సత్యదూరమన్నారు. ఈ ఏనుగు దంతాలను ప్రదర్శనకు ఉంచే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు.
42వేల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం
Published Thu, Feb 27 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
Advertisement
Advertisement