hectares
-
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అల్మోరా, బాగేశ్వర్ సహా పలు జిల్లాల్లో అడవులు తగలబడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు లేఖ రాశారు. అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు నిరంతం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో కోరారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం గత సంవత్సరం నవంబర్ ఒకటి నుండి ఇప్పటివరకూ ఉత్తరాఖండ్ అడవులలో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్ల అటవీప్రాంతం ప్రభావితమైంది. రాష్ట్రంలో అడవుల్లోని కార్చిర్చు అదుపు చేయడం గురించి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అడవుల్లో చెలరేగున్న మంటల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. అలాగే అడవుల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బరాహత్ శ్రేణి అడవుల్లో గురువారం సాయంత్రం వ్యాపించిన మంటలు ఇప్పటి వరకూ పూర్తిగా అదుపులోకి రాలేదు. తాజాగా ముఖెంరేంజ్లోని డాంగ్, పోఖ్రీ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవితో పాటు దుండా రేంజ్‌లోని చామ్కోట్, దిల్సౌద్ ప్రాంతంలోని అడవులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ధరాసు పరిధిలోని ఫేడీ, సిల్క్యారాకు ఆనుకుని ఉన్న అడవులు కూడా తగడలబడుతున్నాయి. అటవీ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఉత్తరకాశీ అటవీ డివిజన్లో 19.5 హెక్టార్ల అడవి మంటల కారణంగా కాలి బూడిదైంది. -
దేశవ్యాప్తంగా పది లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం
సాక్షి సాగుబడి డెస్క్: ప్రకృతి వ్యవసాయం 17 రాష్ట్రాలకు విస్తరించింది. ఈ రాష్ట్రాల్లో 16.78 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం ఉపయోగించి రసాయనరహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో 2,403 హెక్టార్లలో 2,002 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అత్యధికంగా 6,30,000 మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో (2.9 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తుండగా, గుజరాత్లో అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లకు (2.49 లక్షల మంది రైతులు) ప్రకృతి సేద్యం విస్తరించిందని ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్ పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన ఢిల్లీలోని కృషిభవన్‌లో ’జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం’సారథ్య సంఘం మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. తోమర్ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్ (http://nat uralfarminf.dac.gov.in/)ను ప్రారంభించారు. ఈ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ అభివృద్ధి చేసింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలను తెలిపే ఈ పోర్టల్ దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు హాజరయ్యారు. -
చినుకు కరువు.. బీమా బరువు
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ బీమా గడువు నేటితో ముగుస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ పూర్తిగా వెనుకబడింది. వ్యవసాయ పనులు పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో బీమా గడువు పూర్తవుతుండటం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. గత ఏడాది జూలై 7 నాటికి జిల్లాలో 88,541 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది సాగు 37,848 హెక్టార్లకే పరిమితమైంది. జూన్ మొదటి వారంలో వర్షం కొన్ని మండలాల్లో మాత్రమే కురవగా.. ఆ తర్వాత జాడ కరువైంది. ప్రస్తుతం నెల రోజులు గడిచినా వరుణుడు ముఖం చాటేశాడు. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మిల్లీమీటర్లు కాగా.. 48.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూలైలో వారం రోజులు గడిచినా చినుకు ఊసే కరువైంది. ఇక వేరుశనగ సాగు 1,20,261 హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు సాగు 6,503 హెక్టార్లు దాటని పరిస్థితి. ప్రభుత్వం వేరుశనగకు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం కల్పించింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకోని రైతులు ఈనెల 9లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వర్షాభావం కారణంగా సాగు 5.41 శాతం మించకపోవడంతో వాతావరణ బీమా ప్రీమియం ఎలా చెల్లించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. నేటితో గడువు ముగుస్తుండటం గందరగోళానికి తావిస్తోంది. గత ఏడాదికి సంబంధించి వేరుశనగకు 36 మండలాలకు వాతావరణ బీమా కింద పరిహారం మంజూరైంది. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బీమాకు ప్రాధాన్యత పెరిగింది. వెల్దుర్తి మండలంలో వేరుశనగ అధికంగా సాగవుతుండగా.. ఈ విడత వర్షాలు అంతంత మాత్రమే కావడంతో రైతులు వేచిచూస్తున్నారు. ఈ మండలంలో బీమా విషయానికొస్తే ఒక్క రైతు కూడా ప్రీమియం చెల్లించలేదని వ్యవసాయాధికారి రవిప్రకాష్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి వర్షాభావ పరిస్థితులు, ఖరీఫ్ పనులు మందగించడంతో వ్యవసాయ యంత్రాంగం ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. జూలై 15 వరకు అన్ని రకాల పంటలు సాగు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు గతంలో వెల్లడించారు. ప్రస్తుతం పది రోజులు గడిచిపోయినా చినుకు రాలకపోవడం, గాలుల తీవ్రత ఉండటం, సమీప రోజుల్లో వర్షాలపై ఆశ కనుమరుగవుతుండటంతో ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపింది. -
ప్రత్యామ్నాయమే
1.59,978 హెక్టార్లలోనే ఖరీఫ్ సాగు 19,700 హెక్టార్లలో ఆరుతడి పంటలకు కార్యాచరణ 8800 కింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు ఖరీఫ్ సాగు నెమ్మదిగా సాగుతోంది. వర్షపాతం సాధారణం కంటే 66 శాతం తక్కువగా నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు 60 శాతమే పంటలు చేపట్టారు. దీంతో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 15వ తేదీ వరకు వ్యవసాయాధికారులు, రైతులు వర్షాల కోసం ఆశతో ఎదురుచూశారు. అదను దాటిపోతుండడంతో రైతులను ప్రత్యామ్నాయ పంటలకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే స్వల్పకాలిక వంగడాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖ రూరల్ : జిల్లాలో 2,80,783 హెక్టార్లలో ఖరీఫ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా వర్షాభావ పరిస్థితులతో 1,59,978 హెక్టార్లలోనే పంటలు సాగవుతున్నాయి. అదీ జలాశయాల నుంచి సాగునీటి విడుదలతో వాటి పరిధిలోనే ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. ఆగస్టులో సాధారణ వర్షపాతం 196.5 మిల్లీమీటర్లు. ఇంతవరకు కేవలం 68.5 మిల్లీమీటర్లే కురిసింది. దీంతో మిగతా ప్రాంతాల్లో ఆరు తడి పంటలు, స్వల్ప కాలిక వంగడాలే గత్యంతరం. ఆగస్టు 15వ తేదీ వరకు వర్షాలు అనుకూలించకుంటే ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని అధికారులు ముందుగానే నిర్ణయించారు. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికీ కూడా వర్షాలు లేకపోవడంతో 19,700 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించారు. వరి, మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, రాజ్మా పంటలకు సంబంధించి స్వల్పకాలిక విత్తనాల అవసరాలను గుర్తించారు. ఇందులో తక్కువ కాల పరిమితి వరి విత్తనాలు 4700 క్వింటాళ్లు, అలాగే ఇతర పంటలకు సంబంధించి 8800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు కేటాయింపులకు ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. విజయనగరంలో ఉన్న గోదాముల్లో ఈ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. మంగళ,బుధవారాల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల రైతులు అధికారుల దృష్టికి ఇదే విషయాన్ని తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సరఫరా చేయాలని కోరారు. దీంతో మండలాల వారీ అవసరాలను గు ర్తించి సరఫరాకు అధికారులు చర్యలుచేపడుతున్నారు. అయితే బ్యాంకర్లు రు ణాలివ్వకపోవడంతో కొందరు రైతులు పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నా రు. స్వల్పకాలిక పంటలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
కల్తీ మాఫియా
కల్తీకి కాదేది అనర్హం అని నిరూపిస్తోంది ఇసుక మాఫియా. అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతోంది. నిర్మాణానికి పనికిరాని సిలికాను ఏటి ఇసుక, తువ్వ మట్టితో కలిపి జనానికి శఠగోపం పెడుతోంది. నాణ్యతలేని ఇసుకతో కట్టిన భవనాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. చెన్నైలో ఇటీవల నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలేందుకు కల్తీ ఇసుకే కారణమని ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి గూడూరు సమీపంలోని సిలికా గనులపై పడింది. సాక్షి, నెల్లూరు/ సూళ్లూరుపేట: జిల్లాలోని చిల్లకూరు, కోట ప్రాంతంలో 46 వేల హెక్టార్లలో సిలికా ఖనిజం( ఓ రకమైన ఇసుక) విరివిగా లభిస్తోంది. మైనింగ్ లీజుదారులతో పాటు కొందరు అక్రమంగా సిలికాను తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వ భూముల్లోనే అక్రమంగా సిలికాను తవ్వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. సిలికా ఇసుకను పోలివున్నా నిర్మాణానికి పనికిరాదు. కంప్యూటర్లో వినియోగించే పరికరాలు, కొన్ని రకాల గ్లాస్ తయారీలో దీనిని వినియోగిస్తారు. వీటికి సంబంధించిన ఫ్యాక్టరీలు బెంగళూరు, పూణె, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో చెన్నైతో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో నిర్మాణ ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా తమిళనాడులో ఇసుక మైనింగ్‌పై నిషేధం ఉండడంతో అక్కడ విపరీతమైన గిరాకీ ఉంది. దీనిని ఇసుక వ్యాపారుల్లో కొందరి కన్ను సిలికాపై పడినట్టు తెలుస్తోంది. పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదుల నుంచి అక్రమంగా తవ్వుతున్న ఇసుకను రహస్య కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ సిలికాను కలిపి చెన్నై తదితర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. కొందరైతే పులికాట్ సరస్సు అంచుల్లో లభించే మట్టిని కూడా సిలికాలో కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తడ మండలంలోని కారూరు పారిశ్రామిక వాడలో సిలికా శుద్ధి కర్మాగారం ఉంది. ఆ కంపెనీలో శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలుగా బయటకు వచ్చిన ఇసుకను కంపెనీ వెనుక భాగంలో డ ంప్ చేస్తారు. దీనిని కూడా కొందరు ఇసుక వ్యాపారులు కొనుగోలు చేసి తమిళనాడులోని ఓ ప్రాంతానికి తరలించి, నదుల నుంచి సేకరించిన ఇసుకతో అక్కడ కల్తీ చేస్తున్నట్లు సమాచారం. తడకండ్రిగ అనపగుంట సమీపంలోనూ ఇలాంటి కల్తీ ఇసుక అక్రమ రవాణా కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరో కేంద్రం తమిళనాడులోని కవరైపేటై వద్ద జాతీయ రహదారిని అనుకునే వుంది. ఈ ఇసుకను మినీ లారీలు, టిప్పర్లలో లోడ్ చేసి తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల చెన్నైలోని పోరూరు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ కూలిపోయి సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణాలు పూర్తిగా వెలుగులోకి రానప్పటికీ కల్తీ ఇసుక వాడడం కూడా ఓ కారణమై ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు ఈ కల్తీ ఇసుక మాఫియాపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. -
రాలని చినుకు
అయోమయంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్న వ్యవసాయాధికారులు అపరాలు, చిరుధాన్యాలు మేలు అనకాపల్లి : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. మైదానంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏజెన్సీలో అప్పుడప్పుడు చినుకులు పడుతున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో సాధారణంలో సగం కూడా వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు పుంజుకుంటేనే పంటలసాగు మెరుగవుతుంది. ఖరీఫ్‌లో గట్టెక్కగలమన్న ఆశలు రైతుల్లో అడుగంటుతున్నాయి. జిల్లాలో ఈ సమయానికి 128.8 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా ప్రస్తుతం 39.8 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈ ఖరీఫ్‌లో మొత్తం 2,27,400 హెక్టార్లలో సాగు లక్ష్యంగా వ్యవసాయాధికారులు నిర్దేశించారు. లక్షా 10 వేల హెక్టార్లలో వరి, 40 వేల హెక్టార్లలో చెరకు, 25 వేల హెక్టార్లలో రాగులు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 32,400 హెక్టార్లలో ఇతర పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందిం చారు. గతేడాది ఖరీఫ్ జూలై చివరి వారంలో ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టు వరకు వేచి ఉండాల్సి వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అప్పటికీ వర్షాలు అనుకూలించకుంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తామంటున్నారు. జిల్లాలో భూ గర్బజాలాలూ అడుగంటుతున్నాయి. ఈ సీజన్లో సగటున 24.84 అడుగుల లోతున నీరు లభ్యం కావాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితులు కారణంగా భూగర్భజలాలు 26 అడుగుల కిందకు వెళ్లిపోయాయి. జూన్ నెలాఖరవుతున్నా వాన జాడ లేదు. రైతులతో పాటు, వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వర్షాలు అనుకూలిస్తే జూన్ 15నాటికి వరి నారుపోతలు పూర్తవ్వాలి. రోజులో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైతేనే నారుమళ్లకు అవసరమైన తేమ లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో చినుకు జాడలేకపోవడంతో రైతులు జూలై, ఆగస్టు వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు. జూన్‌లో వర్షాలు అనుకూలిస్తే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, ఇంద్ర వంటి రకాలను చేపట్టవచ్చు. కానీ వర్షాలు కలిసి రాలేదు. ఇప్పుడు జూలై వర్షాలే ఆదుకోవాలి. అదే జరిగితే వసుంధర, కాటన్దొర సన్నాలు, సురేఖ రకాలు నారుగా పోసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సి.వి. రామారావు సూచిస్తున్నారు. జూలైలో కూడా వరుణుడు కరుణించకుంటే ఆగస్టులో స్వల్ప కాలిక వంగడాలను నేరుగా ఎదజల్లే పద్ధతిలో నాట్లు వేసుకోవాలన్నారు. అప్పుడు ఎంటీయూ 1001,ఎంటీయూ 1010 వంగడాలను వినియోగిస్తే మేలు. వీటిని డ్రమ్‌సీడర్ ద్వారా లేదా నేరుగా ఎదజల్లే పద్ధతిలో వేస్తే రైతులకు ప్రయోజకరంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు సూచించడంతో వరి సాగుని తగ్గించి, మెట్టపంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు పేర్కొం టున్నారు. నీటి వనరులు అధికంగా అవసరమయ్యే వరి విస్తీర్ణాన్ని తగ్గించి అపరాలు, చిరుధాన్యాలు, జోన్న వంటి పంటలను చేపట్టాలని చెబుతున్నారు. -
వడగళ్ల నష్టాన్ని చూడొచ్చారు..
జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం తిమ్మంపేట, చిన్నపెండ్యాల, గవిచర్లలో పర్యటన పంట క్షేత్రాలను పరిశీలించిన అధికారులు కడగండ్లపై నివేదిక అందజేసిన కలెక్టర్ వరంగల్, న్యూస్‌లైన్ : గత నెలలో జిల్లాలో కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర అధికారుల బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. మూడు రోజుల పాటు కురిసిన వడగళ్లు జిల్లాలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపెద్ద వడగళ్లు పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతాలను కేంద్ర బృందం పర్యటించింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రామంలో మొక్కజొన్న, వరి, మామిడి, సపోటా తోటలను పరిశీలించింది. రైతులతో చర్చించి పంటలు, నష్టపోయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ధ్వంసమైన ఇండ్లు, మృతి చెందిన పశువుల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌ఘనపురం మండలం చిన్నపెండ్యాల గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో వివిధ మండలాల్లో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన పంటలు, ధ్వంసమైన ఇండ్లు, మృతి చెందిన పశువులకు సంబంధించిన ఛాయ చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాలో వడగండ్ల వాన వలన నష్టపోయిన పంట వివరాలను జిల్లా కలెక్టర్ జి.కిషన్ కేంద్ర బృందానికి వివరించారు. వ్యవసాయ పక్షాన జరిగిన నష్టంపై నివేదిక సమర్పించారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 22కోట్ల పరిహారాన్ని కోరుతూ నివేదిక అందించారు. ఇందులో వెయ్యి హెక్టార్లలో పత్తి, 13వేల హెక్టార్లలో మొక్కజొన్న, 13వేల హెక్టార్లలో వరి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు. ఉద్యవనశాఖ నుంచి 4436.65 హెక్టార్లలో మిర్చి, పండ్లు, కూరగాయాల తోటలకు జరిగిన నష్టాన్ని తెలియజేశారు. 8169 మంది రైతులు నష్టపోయారని, రూ. 4.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించారు. వ్యవసాయ శాఖతో పాటు రెవిన్యూ, ఉద్యావనశాఖ, రోడ్లు,భవనాలు, విద్యుత్‌శాఖ అధికారులు తమ శాఖలపరంగా జరిగిన నష్టంపై నివేదిక అందించారు. కలెక్టరేట్లో సమావేశం అనంతరం సంగెం మండలం గవిచర్లలో దెబ్బతిన్న పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పూర్తిగా నష్టపోయారనే అంచనాకు అధికారులు వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు బి.కళ్యాణచ క్రవర్తి, ఆర్పి సింగ్, పంకజ్ త్యాగి, టిజిఎస్ త్యాగి, ఎన్ఎస్ మోది, డీఆర్ఓ సురేంద్రకరణ్, వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ జి.రామారావు, ఉద్యాన వన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎంవి అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
42వేల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని 53,020 హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా జనవరి చివరకు 42,169 హెక్టార్లకు మాత్రమే అందించగలిగినట్లు మంత్రి శివరాజ్ తంగడి తెలిపారు. విధానపరిషత్‌లో ఎమ్మెల్సీ అశ్వత్థనారాయణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రాబోవు ఏడాదిలో తొమ్మిది జిల్లాల్లోని 79 తాలూకాల్లో ఉన్న 1881 చెరువుల్లో పూడిక తొలగింపు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానం రాష్ట్రంలో త్వరలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి రానుందని మంత్రి ప్రకాశ్హుక్కేరి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలు రూపొందించినట్లు చెప్పారు. మంత్రిమండలి ఆమోదం తర్వాత ఈ నూతన విధానం అమల్లోకి వస్తున్నారు. దీని వల్ల రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు సరళంగా ఉండటమే కాకుండా పారదర్శకత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిశ్రామికవిధానం మార్చి 31తో ముగుస్తుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహికులకుప్రభుత్వం ఉత్తమ సదుపాయాలు, రాయితీలు అందజేస్తుందని అన్నారు. ఏనుగు దంతాల ప్రదర్శన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 9.5 టన్నుల ఏనుగు దంతాలు ఉన్నాయన్నారు. మైసూరు, శివమొగ్గలోని ప్రత్యేక గోదాముల్లో వీటిని సంరక్షిస్తున్నట్లు చెప్పారు. వీటిని కాల్చివేయనున్నట్లు వస్తున్న వదంతలు సత్యదూరమన్నారు. ఈ ఏనుగు దంతాలను ప్రదర్శనకు ఉంచే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు.