
నాకు హీరోయిన్‌గా జయ నటించారు
ముంబై: జయలలిత మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు ధర్మేంద్ర అన్నారు. ఇజ్జత్ సినిమాలో జయలలిత, తాను కలసి నటించామని నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని విన్నానని, కోలుకోవాలని ప్రార్థించానని, ఇంతలోనే ఆమె మరణవార్త తనను కలచివేసిందని చెప్పారు. జయలలిత మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
జయలలిత, ధర్మేంద్ర కలసి నటించిన ఇజ్జత్ సినిమా 1968లో విడుదలైంది. హిందీలో జయలలిత నటించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాలో ధర్మేంద్ర ప్రియురాలి పాత్రలో ఆమె నటించారు. టీ ప్రకాశ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.