పోలీస్‌స్టేషన్‌కు రాకుంటే అరెస్టే! | Actor Simbu must appear before Coimbatore | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌కు రాకుంటే అరెస్టే!

Published Fri, Dec 18 2015 1:54 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

పోలీస్‌స్టేషన్‌కు రాకుంటే అరెస్టే! - Sakshi

పోలీస్‌స్టేషన్‌కు రాకుంటే అరెస్టే!

చెన్నై: నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్ ప్రత్యక్షంగా పోలీసుస్టేషన్‌లో హాజరవకపోతే అరెస్ట్ చేస్తామని కోవై పోలీసులు హెచ్చరించారు. అసత్య పద జాలాలతో పాటను రాసి పాడారని నటుడు శింబు, అనిరుద్‌లపై మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవై రేస్‌కోర్సు పోలీసులు స్థానిక కమిషనర్ అమల్‌రాజ్ ఆదేశాల మేరకు చెన్నై నుంచి శింబు, అనిరుద్‌ల కోసం గాలింపు ప్రారంభించారు.

అయితే ఇంతవరకు శింబు ఆచూకి దొరకలేదు. అదే విధంగా అనిరుద్ కెనడా నుంచి చెన్నైకు తిరిగి రాలేదు. అయితే మూడు రోజుల పాటు చెన్నైలోనే మకాం వేసిన కోవై రేస్ కోర్సు పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. అయితే శింబు, అనిరుద్ ఈ నెల 19వ తేదీన స్టేషన్‌లో ప్రత్యక్షంగా హాజరు కావాలని ఇప్పటికే వారింటికి సమన్లు పంపించిన విషయం తెలిసిందే. అయితే శింబు, అనిరుద్ కోవై పోలీసుస్టేషన్‌లో హాజరు కాని పక్షాన వారిని అరెస్టు చేస్తామనిపోలీసులు హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement