Music Director Anirudh
-
మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడితో హీరోయిన్ లవ్!
అక్కినేని నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో..’ సినిమాతో తెరంగేట్రం చేసిన నటి మంజిమా మోహన్ ప్రస్తుతం ప్రేమలో పడ్డట్లు కోలీవుడ్ టాక్. వివాదాస్పదుడిగా పేరుపొందిన ప్రముఖ సంగీత దర్శకుడి తమ్ముడితో ఈ యంగ్ హీరోయిన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. అతని పేరు రిషికేష్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కజిన్. మంజిమ, రుషికేష్‌లు చెన్నైలోని కాఫీ షాపుల్లో తరచూ కలుసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అఫైర్ల విషయంలో అన్న అనిరుద్లా కాకుండా సిన్సియర్‌గా ఉండాలని రుషికేష్ భావిస్తున్నట్లు తెలిసింది. ‘సాహసం శ్వాసగా..’(తమిళంలో ‘అచ్చంయన్భదు మడమయడా’) తర్వాత విక్రమ్ ప్రభుతో ‘క్షత్రియన్’ సినిమాలో నటించింది మంజిమ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న‘వెల్లుమ్’లో ఉధయనిధి స్టాలిన్‌కు జోడీగా కనిపించనుంది. -
అనిరుద్‌కు పెళ్లి కళ?
సంగీత దర్శకుడు అనిరుద్‌కు పెళ్లి కళ వచ్చిందా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ధనుష్ కథానాయకుడిగా ఆయన భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన 3 చిత్రం ద్వారా పరిచయమైన సంచలన యువ సంగీత దర్శకుడు అనిరుద్. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుంటుంబానికి బంధువు అయిన ఆయన తొలిచిత్రం 3లోని వై దిస్ కొలవెరి డీ పాటలో అనూహ్యంగా ప్రాచుర్యం పొందారు. ఆ తరువాత వరుసగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువ సంగీత తరంగంగా రాణిస్తున్నారు. ఆ మధ్య బీప్ సాంగ్ తదితర సంఘటనలతో వివాదాల్లో చిక్కుకున్న అనిరుద్... అజిత్ నటించిన వేదాళం లాంటి చిత్రాలతో హిట్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా అజిత్ నటిస్తున్న వివేకం, శివకార్తికేయన్ నటిస్తున్న వేలైక్కారన్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు. అనిరుద్ త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తల్లిదండ్రులు ఆయనకు పెళ్లి సంబంధం కుదిర్చినట్లు టాక్. వధువు అనిరుద్‌కు వీరాభిమాని అని, ఆమె తండ్రిది నగల వ్యాపారం అని సమాచారం. ఈ ఏడాదిలోనే అనిరుద్ వివాహం జరగనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
వివాదాలపై తొలిసారి నోరు విప్పిన అనిరుధ్
ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజులు జరుగనున్న ఈ వేడుకలో మొదటిరోజు ఆదివారం తమిళ, మలయాళ కళాకారులకు అవార్డులను అందజేశారు. ఈ వేడుకలో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత జంటగా నటించిన 'కత్తి' సినిమాకి అందించిన సంగీతానికిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఎంపికయ్యారు. డిసెంబర్ నెలలో 'బీప్' సాంగ్ పై వివాదం చెలరేగినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉన్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తొలిసారి ఐఫా వేదికపై నోరు విప్పాడు. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఐఫా పురస్కారాన్ని అందుకుంటూ అనిరుధ్.. 'సాధారణంగా నేను స్టేజ్ మీద మాట్లాడను, కానీ ఈరోజు మాట్లాడతాను. కొలవెరి ఢీ పాట సమయం నుంచే నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. కత్తి మూవీ రిలీజ్ టైంలో కూడా చాలా వివాదాలను ఎదుర్కొన్నాను. చివరిగా నేను నేర్చుకున్నదేంటంటే.. వివాదాలను అస్సలు లెక్క చేయకూడదు, మనం పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి. గత నాలుగేళ్లుగా నన్నెంతో ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు, ఈ నాలుగేళ్లలో 11 సినిమాలకు సంగీతం అందించాను. ఒక్కటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను.. బాధ లేకుండా విజయం ఉండదు' అంటూ ముగించాడు ఈ యువ తరంగం. మహిళలను కించపరిచే పదజాలంతో పాడిన 'బీప్' సాంగ్ వివాదంలో తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని వారాల తర్వాత అనిరుధ్ మాట్లాడటం సినీ సర్కిల్స్ లో ఆసక్తి కలిగించింది. -
బీప్ సాంగ్‌తో ఎలాంటి సంబంధం లేదు
చెన్నై: బీప్ సాంగ్ వివాదంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ కోవై రేస్ కోర్స్ పోలీసుల ముందు హాజరై రెండు పేజీల వివరణతో కూడిన లేఖను అందించారు. వివరాల్లోకెళితే శింబు రాసి, పాడిన బీప్ సాంగ్ మహిళలను అగౌరవపరిచే విధంగా ఉందంటూ రాష్ట్రంలో నెల రోజులకు పైగా పెద్ద దుమారమై చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ పాటకు అనిరుద్ సంగీతాన్ని అందించారంటూ శింబుతో పాటు ఆయన పైనా పలు కేసులు నమోదయ్యాయి. వీరిద్దరిని అరెస్ట్ చేయడానికి కోవై, చెన్నై పోలీసులు రంగం సిద్ధం చేశారు. నటుడు శింబు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌కు అర్హతను పొందారు. అయితే సంగీత కచేరీల కోసం కెనడా వెళ్లిన అనిరుద్ పోలీసుల ముందు హాజరు కావడానికి కాల సమయాన్ని కోరారు. దీంతో ఆయన తిరిగి రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అనిరుద్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో కోవై రేస్ కోర్స్ పోలీసుల ఎదుట హాజరై బీప్ సాంగ్ వ్యవహారంలో వివరణతో కూడిన లేఖ ఇచ్చారు.అందులో తనకు బీప్ సాంగ్ పాటకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఈ విషయాన్ని నటుడు శింబు కూడా వెల్లడించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పాటపై వివాదం చెలరేగినప్పుడు కెనడాలో ఉన్నానని పోలీసుల సమక్షంలో హాజరు కాలేక పోయానని చెప్పారు. తన ప్రమేయం లేక పోయినా తనపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. అనిరుద్ వివరణ లేఖను అందుకున్న కోవై రేస్ కోర్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ సెల్వరాజ్ విచారణకు పిలిచినప్పుడు హాజరవ్వాలని అనిరుద్‌కు చెప్పారు. పోలీసుల ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని అనిరుద్ హామీ ఇచ్చారు. -
బీప్సాంగ్తోనే అనిరుద్ అవుట్
యువ సంగీత దర్శకుడు అనిరుద్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది నటుడు ధనుష్. 3 సినిమా ద్వారా రంగప్రవేశం చేసిన అనిరుద్‌కు ధనుష్ భార్య ఐశ్వర్యకు సోదరుడి వరస అవుతాడు. 3 సినిమా విజయం సాధించకపోయినా అందులోని 'వై దిస్ కొలై వెరి డీ' పాట అనిరుద్‌ను ఆకాశానికి ఎత్తేసింది. తర్వాత ధనుష్ ఆయనకు వరుసగా అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. మారి, వేలై ఇల్లా పట్టాదారి, తంగమగన్ చిత్రాలు వీళ్ల కాంబినేషన్లో వచ్చాయి. ధనుష్ తాజా చిత్రం కొడికి కూడా అనిరుద్‌నే సంగీతదర్శకుడిగా ఎంపిక చేశారు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా ఆ చిత్రం నుంచి అనిరుద్‌ను తొలగించి సంతోష్ నారాయణ్‌ను నియమించడం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారిం ది. శింబు బీప్‌సాంగ్ వివాదంలో అనిరుద్ ఇరుక్కున్నాడనే వార్తలు వెలువడ్డ సమయంలో ధనుష్ ఆ ప్రచారాన్ని ఖండించాడు. అనిరుద్ తనకు చిన్నతనం నుంచి తెలుసని, అతడు అలాంటి పాటకు సంగీతాన్ని అందించి ఉండకపోవచ్చని అన్నాడు. అలాంటిది ఇప్పుడు తన సినిమా నుంచే అనిరుద్‌ను తొలగించడానికి కారణాలను కోలీవుడ్ ఆరాతీసే పనిలో పడింది. శింబు బీప్ సాంగ్ వివాదంలో అనిరుద్పై కూడా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ని పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం హోరెత్తుతోంది. ఈ వ్యవహారంలో శింబు మద్రాసు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ను పొందాడు. సంగీత కచేరీ కోసం కెనడా వెళ్లిన అనిరుద్ మాత్రం ఈ వివాదం చెలరేగి నెల రోజులు దాటినా చెన్నైకి తిరిగి రాకుండా కెనడా, లండన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన్ని మళ్లీ తన చిత్రానికి పెట్టుకుంటే తన ఇమేజ్‌కు దెబ్బ తగిలే అవకాశం ఉందని భావించిన ధనుష్ తన కొడి చిత్రం నుంచి తప్పించి సంతోష్ నారాయణ్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇదే అదనుగా భావించిన సంతోష్ నారాయణ్ తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు, బేరసారాల తర్వాత ముప్పావు కోటికి సెటిల్ అయినట్లు చెవులు కొరుక్కుంటున్నారు. -
పోలీస్‌స్టేషన్‌కు రాకుంటే అరెస్టే!
చెన్నై: నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్ ప్రత్యక్షంగా పోలీసుస్టేషన్లో హాజరవకపోతే అరెస్ట్ చేస్తామని కోవై పోలీసులు హెచ్చరించారు. అసత్య పద జాలాలతో పాటను రాసి పాడారని నటుడు శింబు, అనిరుద్‌లపై మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవై రేస్‌కోర్సు పోలీసులు స్థానిక కమిషనర్ అమల్‌రాజ్ ఆదేశాల మేరకు చెన్నై నుంచి శింబు, అనిరుద్‌ల కోసం గాలింపు ప్రారంభించారు. అయితే ఇంతవరకు శింబు ఆచూకి దొరకలేదు. అదే విధంగా అనిరుద్ కెనడా నుంచి చెన్నైకు తిరిగి రాలేదు. అయితే మూడు రోజుల పాటు చెన్నైలోనే మకాం వేసిన కోవై రేస్ కోర్సు పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. అయితే శింబు, అనిరుద్ ఈ నెల 19వ తేదీన స్టేషన్లో ప్రత్యక్షంగా హాజరు కావాలని ఇప్పటికే వారింటికి సమన్లు పంపించిన విషయం తెలిసిందే. అయితే శింబు, అనిరుద్ కోవై పోలీసుస్టేషన్లో హాజరు కాని పక్షాన వారిని అరెస్టు చేస్తామనిపోలీసులు హెచ్చరించారు.