అనిరుద్‌కు పెళ్లి కళ? | wedding bells for music director anirudh | Sakshi
Sakshi News home page

అనిరుద్‌కు పెళ్లి కళ?

Published Wed, Mar 29 2017 2:28 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

అనిరుద్‌కు పెళ్లి కళ?

అనిరుద్‌కు పెళ్లి కళ?

సంగీత దర్శకుడు అనిరుద్‌కు పెళ్లి కళ వచ్చిందా? అవుననే అంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. ధనుష్‌ కథానాయకుడిగా ఆయన భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన 3 చిత్రం ద్వారా పరిచయమైన సంచలన యువ సంగీత దర్శకుడు అనిరుద్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుంటుంబానికి బంధువు అయిన ఆయన తొలిచిత్రం 3లోని వై దిస్‌ కొలవెరి డీ పాటలో అనూహ్యంగా ప్రాచుర్యం పొందారు.

 ఆ తరువాత వరుసగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువ సంగీత తరంగంగా రాణిస్తున్నారు. ఆ మధ్య బీప్‌ సాంగ్‌ తదితర సంఘటనలతో వివాదాల్లో చిక్కుకున్న అనిరుద్‌... అజిత్‌ నటించిన వేదాళం లాంటి చిత్రాలతో హిట్‌ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా అజిత్‌ నటిస్తున్న వివేకం, శివకార్తికేయన్‌ నటిస్తున్న వేలైక్కారన్‌ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు.

అనిరుద్‌ త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.  తల్లిదండ్రులు ఆయనకు పెళ్లి సంబంధం కుదిర్చినట్లు టాక్‌. వధువు అనిరుద్‌కు వీరాభిమాని అని, ఆమె తండ్రిది నగల వ్యాపారం అని సమాచారం. ఈ ఏడాదిలోనే అనిరుద్‌ వివాహం జరగనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన  వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement