చంపేస్తామంటూ నటి సంజనకు బెదిరింపులు | actress Sanjjanaa filed complaint against Friend owes Rs 13.5 lakh | Sakshi
Sakshi News home page

చంపేస్తామంటూ నటి సంజనకు బెదిరింపులు

Published Sat, Jan 18 2014 11:03 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

చంపేస్తామంటూ నటి సంజనకు బెదిరింపులు - Sakshi

చంపేస్తామంటూ నటి సంజనకు బెదిరింపులు

బెంగళూరు : నటి సంజనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.  తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల బెంగళూరు పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది. అందులో సంజన ఈ విధంగా పేర్కొంటూ.... తన కుటుంబ స్నేహితుడు రాజీవ్ మల్హోతా కొడుకు ప్రసాద్ 2012లో తన వద్ద రూ.13.5 లక్షలు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బును తిరిగి చెల్లించమని కోరగా మొదట కొంచెం సమయం అడిగారని, మరోసారి డబ్బు అడగగా చెక్కు ఇచ్చారని తెలిపింది.

ఆ చెక్కు బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యిందని ...ఈ విషయాన్ని వారికి చెప్పి డబ్బు ఇవ్వమని కోరగా మరోసారి డబ్బు అడిగితే చంపుతామని బెదిరించారని పేర్కొంది. రాజీవ్ మల్హోత్రా కలప వ్యాపారం చేస్తున్నారని, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నించినా వారు డబ్బు ఇవ్వకుండా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సంజన కోరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement