రాయచూరు రూరల్ : అక్షయ గోల్డ్ ఫార్మ్ విల్లాస్ ఇండియా కంపెనీ సభ్యుల్లో ఒకరైన ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన హరినాథబాబును రాయచూరులో శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాయచూరు సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ అక్షయ గోల్డ్ ఫార్మ్ విల్లాస్ ఇండియా కంపెనీ ఏజెంట్లను నియమించుకుని పిగ్మీ కలెక్షన్లు సేకరించేదని, అందులో భాగంగా రాయచూరులో కూడా 2007లో శాఖను ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగించిందని తెలిపారు.
2012 లో అక్షయ గోల్డ్ కంపెనీపై ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో కేసు నమోదు కావడంతో అప్పటి నుంచి లావాదేవీలు నిలిచిపోయాయని తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని రాయచూరులోని అక్షయ గోల్డ్ ఏజెంట్లు జిల్లాధికారి కార్యాలయం వద్ద 49 రోజుల నుంచి అందోళన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో అక్షయ గోల్డ్ కంపెనీ కార్యాలయం ఉందని, 7 జిల్లాలలో ఏజెంట్లు సేకరించిన పిగ్మీ కలెక్షన్లతో 2500 ఎకరాల భూమిని కొన్నారని తెలిపారు. అక్షయ గోల్డ్ కంపెనీలో 8 మంది సభ్యులున్నారని, కంపెనీ ఎండీ గోగి సుబ్రమణ్యం విశాఖపట్నంలో ఉంటున్నారని వివరించారు. హరినాథబాబుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అక్షయ గోల్డ్ సభ్యుడి అరెస్ట్
Published Sat, Jul 26 2014 3:26 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement