తాగిన మత్తులో పాము పట్టడానికి యత్నం | Alcohol Drunked man Catches Snake And Hospitalized | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో పాము పట్టడానికి యత్నం

Published Wed, May 1 2019 9:32 AM | Last Updated on Wed, May 1 2019 9:32 AM

Alcohol Drunked man Catches Snake And Hospitalized - Sakshi

చికిత్స పొందుతున్న గోవిందరాజు

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పీకలదాకా తాగి కొందరు తాగుబోతులు రోడ్లమీద,అక్కడక్కడా చేసే పనులు ఒక్కోసారి చూడ్డానికి భలేగా ఉంటాయి. వాళ్ల చేష్టలు, మాటలు నవ్వులు తెప్పిస్తాయి. నెలమంగలలో ఒక తాగుబోతు ఇలాంటి పనే ఒకటి చేసాడు. తాగినమత్తులో పాము పట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి పాము కాటుకు గురైన సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. నెలమంగల పట్టణ పరిధిలోని విశ్వేశ్వరపురలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇదే కాలనీకి చెందిన గోవిందరాజు (35) పెయింటర్‌. సోమవారం రాత్రి తాగిన మత్తులో ఉన్న గోవిందరాజుకు కాలనీలో పాము కనిపించింది. దానిని పట్టుకునేందకు యత్నించాడు. దీంతో పాము చేతి వేళ్లకు కాటువేసింది. అస్వస్థతకు గురైన గోవిందరాజును పట్టణంలోని హర్ష ఆస్పత్రికి తరలించారు. పాములు పట్టడం రాకపోయినా తాగిన మత్తులో గోవిందరాజు చేసిన పనికి స్థానికులకు నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement