‘ఆర్కావతి’తో సీఎంకు సంబంధం
ఇందుకు ఆధారాలున్నాయి
మాజీ సీఎం యడ్యూరప్ప
శివమొగ్గ : బెంగళూరులోని ఆర్కావతి లే అవుట్ డీ నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధాలున్నాయని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప అన్నారు. స్థానిక గోపీ సర్కిల్లో శుక్రవారం ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఎస్.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాల అవధిలో అభివృద్ధి విషయంలో డీ నోటిఫికేషన్లు జరపడం జరిగిందని అన్నారు.
అయితే అది కేవలం రెండు, మూడు ఎకరాల భూమిని డీనోటిఫై చేయడం జరిగిందని గుర్తు చేశారు. అయితే సిద్ధరామయ్య 50 నుంచి వంద ఎకరాల భూమిని డీ నోటిఫికేషన్ చేసినట్లు, ఈ పనులు న్యాయానికి విరుద్ధంగా జరిగినట్లు తెలిసిందని అన్నారు. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి విడుదలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.