హంతకులను వారంలోపు అరెస్ట్‌ చేయాలి | B. S. Yeddyurappa demands to fing RSS activist Rudresh murderes | Sakshi
Sakshi News home page

హంతకులను వారంలోపు అరెస్ట్‌ చేయాలి

Published Thu, Oct 20 2016 9:18 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

హంతకులను వారంలోపు అరెస్ట్‌ చేయాలి - Sakshi

హంతకులను వారంలోపు అరెస్ట్‌ చేయాలి

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రుద్రేష్‌ హంతకులను వారం రోజుల్లోగా అరెస్ట్‌ చేయకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తామని బీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప

బొమ్మనహళ్లి (బెంగళూరు): ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రుద్రేష్‌ హంతకులను వారం రోజుల్లోగా అరెస్ట్‌ చేయకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తామని బీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపడటంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. బెంగళూరు నగరంతో పాటు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భద్రత కొరవడిందన్నారు. చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయని, హంతకులు చెలరేగి పోతున్నారన్నారు. 

కేవలం చేతులు తడిపేవారికే సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. సిద్దరామయ్య  అసలు రంగు త్వరలో బయటపడుతుందని బీఎస్‌వై.హెచ్చరించారు.  నిరు పేద ప్రజలు చనిపోతే వారి అంత్య క్రియలకు రూ.5 వేలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. అయితే  స్టీల్‌ వంతెన నిర్మాణానికి మాత్రం రూ. 1700 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని అన్నారు.  స్టీల్‌ వంతెన పనులు నిలిపి వేయాలని, లేని పక్షంలో ఉద్యమబాట పడుతామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement