హంపి ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు | Be active in Hampi festivals | Sakshi
Sakshi News home page

హంపి ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

Published Sun, Jan 5 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

Be active in Hampi festivals

హొస్పేట,న్యూస్‌లైన్ : ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న హంపి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని జిల్లాధికారి ఆదిత్య ఆమ్లాన్ బి స్వాస్ తెలిపారు. శనివారం ఆయన జి ల్లాలో హంపి ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం విలేకరులతో మా ట్లాడారు.దాదాపు రూ.7కోట్ల వ్య యం తో హంపి ఉత్సవాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ ఉత్సవాలకు నాలుగు వేదికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన వేదికగా శ్రీకృష్ణదేవరాయ వేదిక, ఎంపీ ప్రకాష్‌వేదిక, విద్యారణ్యవేదిక, అక్కాబుక్కా వేదికల్లో మూడు రోజులు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో హంపి బై స్కై (ఆకాశం)కు ప్రయాణం చేసేందుకు (హెలికాప్టర్ ద్వారా) హంపి, సండూరు, టీబీడ్యాంను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

హంపి బైస్కై వీక్షించేందుకు మూడు హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దలకు రూ.2 వేల, 10  సంవత్సరాలు లోపు ఉన్న చిన్నారులకు రూ.1500 లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. హంపి ఉత్సవాలకు వచ్చే వీవీఐపీలు, రాజకీయనేతలకు, కళాకారులకు వసతి సౌకర్యం కల్పించామన్నారు .హంపి ఉత్సవాలు వీక్షించే పర్యాటకులకు రాత్రి పూటభోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు చోట్లు భోజన వసతి  ఉంటుందన్నారు. భోజనాలకు రూ.5లు వసూలు చేస్తున్నామన్నారు.

జిల్లా నుంచి రాష్ట్రం, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.10వ తేది సాయంత్రం శ్రీ కృష్ణదేవరాయ వేదికలో హంపి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉత్సవాలను ’ప్రారంభిస్తారని తెలిపారు. అదే విధంగా ముఖ్య అతిథులుగా పర్యాటక శాఖమంత్రి దేశ్‌పాండే, ఇతర మంత్రులు, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా వస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ముగ్గులు పోటీలతో పాటు, గ్రామీణ క్రీడలు ఉంటాయన్నారు.

ఈ సారి ముఖ్యంగా వికలాంగులకు కూడా క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. హంపిలో నాలుగు ప్రధాన వేదికలకు, స్మారకాలకు  విద్యుత్‌దీపాలంకరణ చేస్తామన్నారు. ఉత్సవాలకు వీక్షించేందుకు వచ్చే వారికి అదనంగా బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్, హొస్పేట అసిస్టెంట్‌కమిషనర్ సునిల్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement