Biswas
-
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
న్యూఢిల్లీ: దేశీయంగా పేమెంట్స్ బ్యాంకులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో అనుబ్రత బిశ్వాస్ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు అందించే (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) దిశగా అమలవుతున్న చర్యలు, ఆర్థిక.. డిజిటల్ వృద్ధి పుంజుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.డిజిటల్ బ్యాంకింగ్‌లో 10 కోట్ల మంది యూజర్ల స్థాయిలో అవకాశాలు ఉన్నాయని బిస్వాస్ వివరించారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, డిజిటల్ ఇన్‌క్లూజన్ మార్కెట్ పరిమాణం 50 కోట్ల యూజర్ల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనాభా ఆర్థిక అవసరాల కోసం వివిధ విధానాల్లో పని చేసే భారీ బ్యాంకులు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుందని బిశ్వాస్ పేర్కొన్నారు.ప్రస్తుతం 70 కోట్ల పైచిలుకు స్మార్ట్ఫోన్లు ఉండగా దాదాపు ఆర్థికంగా చెల్లింపులు జరిపేవారు (యూపీఐ ద్వారా, నగదు లావాదేవీల రూపంలో) 40 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. డిజిటల్ యూజర్లు, డిజిటల్ ఫైనాన్షియల్ యూజర్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడంలో ఫిన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషించగలవని బిశ్వాస్ పేర్కొన్నారు.తమ సంస్థ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు దాదాపు 5,00,000 బ్యాంకింగ్ పాయింట్స్ ఉన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రగామిగా ఉన్నామని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో కలిపి ప్రతి నెలా పది లక్షల బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఇవి చదవండి: నిరాశపర్చిన ఈ-టూవీలర్స్ విక్రయాలు.. -
గణాంకాల్లో మన ఘన వారసత్వం
భారత్‌కు గొప్ప గణాంక శాస్త్ర సంప్రదాయం ఉంది. గణాంక శాస్త్ర ప్రపంచంపై ఆధిపత్యం చలాయించగల నిపుణులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గణాంక శాస్త్ర అభివృద్ధి కోసం భారత్ అసాధారణ ప్రేరణనిచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ (స్టాట్‌కమ్)కు భారత్ ఎన్నిక కావడం మనం సంతోషించాల్సిన విషయం. విధాన నిర్ణయం, పర్యవేక్షక పాత్రలో మన దేశం ఉంటుంది. సుసంపన్నమైన భారత్ గణాంక వారసత్వం, భారత ‘ప్రణాళికా పురుషుడి’గా సుపరిచితమైన ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటుంది. ఆయన దేశంలో గణాంక శాస్త్రానికి మార్గదర్శి మాత్రమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)ని స్థాపించారు. భారత గణాంక సమాజం సంతోషించ డానికి కనీసం రెండు కారణాలు ఉన్నాయి. గణాంక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ బహుమతిని ఇండియన్–అమెరికన్ గణాంక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఆర్ రావుకు బహూకరించారు(ఈయన తెలుగువాడు). సైన్సును, టెక్నాలజీని, మానవ సంక్షేమాన్ని పురోగమింపజేయడానికి గణాంక శాస్త్రాన్ని ఉపయోగించి కీలక విజయాలను సాధించినందుకు ప్రతి రెండేళ్ల కోసారి ఒక వ్యక్తికి లేదా బృందానికి ఈ అవార్డును అందజేస్తారు. గణాంక శాస్త్ర సిద్ధాంతాలకు దశాబ్దాలుగా సీఆర్ రావు అందించిన తోడ్పాటుకు ఇది నిస్సందేహంగా సరైన గుర్తింపు అని చెప్పాలి. మరొక విజయం, ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ (స్టాట్‌కమ్)కు భారత్ ఎన్నిక కావడమే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విధాన నిర్ణయం, పర్యవేక్షక పాత్రలో మన దేశం ఐక్యరాజ్యసమితి సంస్థలో తిరిగి చేరింది. 1947లో స్థాపితమైన స్టాట్‌కమ్... ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కౌన్సిల్ (ఎకోసాక్)కు చెందిన కార్యాచరణ కమిషన్. ఇది ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం (యూఎన్ఎస్డీ) పనిని పర్యవేక్షి స్తుంది. అలాగే ప్రభుత్వ విధానాలకు, ప్రైవేట్ కార్యాచరణకు తోడ్ప డేలా గణాంక సమాచార అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యం వైపుగా కృషి చేయడానికి ప్రపంచవ్యాప్త గణాంక శాస్త్రజ్ఞులను ఒక చోటికి తెస్తుంది. స్టాటిస్టికల్ కమిషన్, నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితి హెచ్ఐవీ/ఎయిడ్స్ జాయింట్ ప్రోగ్రామ్... వీటన్నింటికీ భారత్ ‘ఎకోసాక్’ ద్వారా ఎన్నికైంది. స్టాట్‌కమ్ వ్యస్థాపక పితామహుడు అమెరికన్ సామాజిక శాస్త్ర వేత్త, గణాంక శాస్త్రవేత్త అయిన స్టూవర్ట్ అర్థర్ రైస్. 1946 మేలో న్యూయార్క్‌లోని హంటర్ కాలేజీలో ‘న్యూక్లియర్ సెషన్’కు రైస్ అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్య సమితి పరిధిలో గణాంకాల కోసం ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు, దానికి అవసరమైన నిబంధనలను ఆనాటి సెషన్ సిఫార్సు చేసింది. స్టాట్‌కమ్ తొలి మూడు సెషన్లకు 1947–48 కాలంలో కెనడియన్ హెర్బర్ట్ మార్షల్ అధ్యక్షత వహించారు. ప్రపంచ గణాంక వ్యవస్థ రూపకల్పనను వేగవంతం చేయడం ద్వారా శాంతి కోసం ప్రపంచాన్ని కూడగట్టే ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలకు తోడ్పడటం అనే లక్ష్యాన్ని మూడో సెషన్ (1948) నివేదిక ప్రకటించింది. అంతర్జాతీయ గణాంకపరమైన కార్యకలాపాల కోసం ఏర్పడిన అత్యున్నత నిర్ణాయక విభాగమైన స్టాట్‌కమ్... గణాంకపరమైన ప్రమాణాలను రూపొందించడం; జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వాటిని అమలు చేయడంతో సహా భావనలు, విధానాల అభివృద్ధి విషయంలో బాధ్యత తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాల్లోని – మొత్తంగా 24 – కీలక గణాంక శాస్త్రవేత్తలను ఇది ఒకటి చేసింది. గత 76 సంవత్సరాల కాలంలో, కమిషన్ ప్రపంచమంతటి నుంచి ఒక చీఫ్ స్టాటిస్టీషియన్ నేతృత్వంలో నడుస్తూ వచ్చింది. గణాంకాలు, వైవిధ్యత, జనాభా రంగంలో భారతీయ నైపుణ్యమే ఐక్యరాజ్యసమితి స్టాటిస్టికల్ కమిషన్‌లో భారత్‌కు స్థానం సాధించి పెట్టిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవలే ట్వీట్ చేశారు. సుసంపన్నమైన భారత్ గణాంక వారసత్వం, భారత ‘ప్రణాళికా పురు షుడి’గా సుపరిచితమైన ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటుంది. ఆయన దేశంలో గణాంక శాస్త్రానికి మార్గదర్శి మాత్రమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)ని స్థాపించారు. ఆధునిక భారత గణాంక వ్యవస్థలో అత్యంత విశిష్ట వ్యక్తి అయిన మహలనోబిస్ భారత రెండో పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి కూడా. అలాగే జాతీయ శాంపిల్ సర్వే సంస్థతో పాటు కేంద్ర గణాంక సంస్థ స్థాపనలో కూడా కీలకపాత్ర వహించారు. స్టాట్కమ్లో భారత్ మునుపటి పాదముద్రకు ప్రధానంగా మహ లనోబిస్ కారణం. కమిషన్ ప్రారంభ సమయంలో ఆయన శిఖర స్థాయిలో ఉండేవారు. 1946లో ప్రారంభ సెషన్ నుంచి 1970లో సంస్థ 16వ సెషన్ వరకు తన జీవితకాలంలో అన్ని సెషన్లకు హాజరైన అద్వితీయ రికార్డు ఆయన సొంతం. సభ్యుడిగా, రాపోర్టర్‌గా, వైస్ ఛైర్మన్‌గా అనేక పాత్రలను పోషించిన మహలనోబిస్ 1954 నుంచి 1956 వరకు 8వ, 9వ సెషన్లకు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఆ కాలంలో ఆయన సంస్థకు అద్వితీయ తోడ్పాటును అందించారు. నమూనా సేకరణ కోసం ఐక్యరాజ్యసమితి సబ్ కమిషన్ ఏర్పాటు చేస్తే ‘‘ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో గణాంక శాస్త్రం మెరుగుదలను ప్రోత్సహించడంలో గొప్ప సహాయం చేస్తుంది’’ అని సూచిస్తూ మహలనోబిస్ 1946 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ఉత్తరం రాశారు. దానికనుగుణంగానే ఒక సబ్ కమిషన్ ఏర్పాటైంది. తర్వాత ఈ ఉప కమిషన్‌కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ ఉపకమిషన్ నమూనా సర్వే నివేదిక (1947) సన్నాహకాల కోసం సిఫార్సులు చేసింది. వివిధ రంగాల్లో అధికారిక గణాంకాలకు సంబంధించిన నమూనా సర్వేల అన్వయానికి ఈ సిఫార్సులు మార్గాన్ని సుగమం చేశాయి. ‘శిక్షణ పొందిన మానవ వనరులను కలిగి ఉండని దేశాల్లో’ గణాంక శాస్త్రంలో విద్య కోసం అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రోత్స హించడంలో మహలనోబిస్, రైస్ కీలక పాత్ర పోషించారని ఇండి యన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ టీజే రావు ఒక పరి శోధనా వ్యాసంలో పేర్కొన్నారు. అలాంటి సంస్థను ఆసియా దేశాల కోసం లేదా ఇండియా, దాని పొరుగు దేశాల కోసం ఏర్పర్చాలని మహలనోబిస్ సూచించారు. 1950లో కలకత్తాలో స్థాపించిన ‘ది ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఎడ్యుకేషన్ సెంటర్’ (ఐఎస్ఈసీ)ను ఇప్పుడు ఐఎస్ఐ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మహలనోబిస్ 1972లో చనిపోయారు. ఆ సంవత్సరం తన 17వ సెషన్లో చేసిన ఒక తీర్మానంలో కమిషన్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ‘‘సామాజిక గణాంక శాస్త్రం తరపున ఆయన సాగించిన మార్గదర్శక ప్రయత్నాలను స్మరించుకుంటున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాల గణాంక అవసరాల కోసం నిలబడిన ఛాంపి యన్‌గా›ఆయన్ని స్మరించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా గణాంక శాస్త్ర అభివృద్ధి కోసం ఆయన ఇచ్చిన అసాధారణ ప్రేరణను మేము స్మరించుకుంటున్నాము’’ అని పేర్కొంది. ‘‘కమిషన్ సభ్యుల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో ఆయన అసాధా రణ సామర్థ్యాన్ని’’ కూడా కమిషన్ ఆ సందర్భంగా గుర్తుచేసుకుంది. సీఆర్ రావు క్లాస్మేట్, ఎలెక్ట్రానిక్ డేటా ప్రొసెసింగ్‌లో పథగామి వక్కలంక ఆర్.రావు (ఈయనా తెలుగువాడే) 1976లో స్టాట్‌కమ్ 19వ సెషన్‌కు అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి డ్యూటీ స్టేషన్ వెలుపల స్టాట్‌కమ్ నిర్వహించిన ఏకైక సమావేశం ఇదే. ఇది న్యూఢి ల్లీలో జరిగింది. స్టాట్‌కమ్ 70వ వార్షిక సంబరాల కోసం రూపొందించిన బుక్లెట్ బ్యాక్ కవర్ పేజీపై, 1976 సెషన్ కోసం హాజరైనవారు తాజ్‌మహల్ ముందు నిల్చున్న చిత్రాన్ని పొందుపర్చారు. భారత్‌కు ఉజ్వలమైన గణాంక శాస్త్రపు గతం ఉంది. మన దేశం స్టాట్కమ్కు గణనీయ స్థాయిలో తోడ్పాటును అందించింది. అంత ర్జాతీయ గణాంక రంగంలో భారత్ తన స్థానాన్ని తిరిగి పొందినట్ల యితే, అది ప్రశంసార్హమవుతుంది. భారత్‌కు గొప్ప గణాంక శాస్త్ర సంప్రదాయం ఉంది. దీనికి మహలనోబిస్ గొప్ప ప్రయత్నం కారణం. అంతేకాకుండా గణాంక శాస్త్ర ప్రపంచంపై ఆధిపత్యం చలా యించగల నిపుణులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఐక్య రాజ్యసమితి గణాంక కార్యకలాపాల ప్రధాన స్రవంతి వైపు భారత్ తిరిగి వెళ్లడం సరైన దిశగా వేసే ముందడుగు అవుతుంది. అతనూ బిశ్వాస్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఐఎస్ఐ, కోల్‌కతా (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అస్సాంలో కాషాయ రెపరెపలు
గువాహటి: ఎగ్జిట్‌పోల్స్‌అంచనాలను నిజంచేస్తూ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో 74 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎన్డీఏకు స్వల్పంగా సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీ 59 స్థానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ 9 చోట్ల, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 6 సీట్లలో గెలుపొందాయి. ప్రముఖుల హవా... సీఎం సర్బానంద సోనోవాల్, వైద్య మంత్రి హిమంతా బిశ్వాస్ శర్మ, ఏజీపీ చీఫ్, మంత్రి అతుల్ బోరా వరుసగా మజులీ, జాలుక్‌బరి, బోకాఖాట్ నియోజకవర్గాల నుంచి ఘన విజయం సాధించారు. తమ సుపరిపాలనకు మెచ్చే ప్రజలు మరోసారి పాలన సాగించాలని ఎన్డీఏకు అవకాశం ఇచ్చారని సోనోవాల్ వ్యాఖ్యానించారు. మంత్రి హిమంతా బిశ్వా శర్మ లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు ఇది వరుసగా ఐదో గెలుపు. పటచార్‌కుచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు రంజీత్ దాస్... ఏజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పబీంద్ర దేకాపై గెలిచారు. కాంగ్రెస్‌కు మళ్లీ తప్పని ఓటమి... కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 51 సీట్లకే పరిమితమై మరోసారి అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ 30 సీట్లను గెలుచుకోగా మహాకూటమిలోని మిగతా పార్టీలైన ఏఐయూడీఎఫ్ 16 సీట్లలో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 సీట్లలో, సీపీఎం ఒక చోట గెలిచాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రిపుణ్ బోరా తన పదవికి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్లే భారీ మూల్యం చెల్లించుకుందని, ఎన్డీఏ గెలిచేందుకు ఇదే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకుడు రాజన్ పాండే పేర్కొన్నారు. బీజేపీ సైతం అభ్యర్థుల తొలి జాబితా విడుదలలో పొరపాట్లు చేసినా ఆ తర్వాత విడుదల చేసిన జాబితాలలో ఆ తప్పుల ను సరిదిద్దుకుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామనే హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో ఓట్లు పొందలేకపోయిందన్నారు. -
ఏపీ ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. విజయవాడలోని సూర్యరావుపేట రైతుబజార్ సమీపంలో ఉన్న ప్రభుత్వ గృహంలో ఆయన నివసిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద కాపలా ఉండే సెక్యూరిటీ గార్డే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ స్థాయిలో నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురికావడంతో చోరీ జరిగిన విషయాన్ని ఇటు ఐఏఎస్ అధికారి, అటు పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు రూ.85 లక్షల నగదు, రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిసింది. దాదాపు నెల రోజుల కిందట ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అంత భారీ స్థాయిలో నగదు ఇంట్లో ఉన్న విషయం బయటికి పొక్కితే ఐటీ, ఏసీబీ, సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని తెలిసి శశిభూషణ్ కుమార్ తూతూ మంత్రంగా కేసు పెట్టారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని కొంత సొమ్ము రికవరీ చేశారు. ఎంత సొమ్ము చోరీకి గురైంది? ఆభరణాల విలువ ఎంత? అనే వివరాలు మాత్రం వెల్లడించడానికి ఇరువర్గాలు ఇష్టపడకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటో అంతుచిక్కడం లేదు. చోరుడు.. సెక్యూరిటీగార్డే శశిభూషణ్‌కుమార్ ఇంటి వద్ద హైదరాబాద్‌లోని మెట్రో సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన బిస్వాస్‌ను సెక్యూరిటీ గార్డుగా నియమించుకున్నారు. బిస్వాస్‌ది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న అతన్ని అధికారి కుటుంబసభ్యులు కూడా చేరదీసి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. కుటుంబసభ్యుడిలాగే ఇంట్లోకి రానిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఇంట్లో భారీ ఎత్తున సొమ్ము సూట్‌కేసులో దాచి ఉంచిన విషయాన్ని గుర్తించిన బిస్వాస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగదుతోపాటు విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయాడు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన శశిభూషణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కొంత సమయం తీసుకున్నారు. అనంతరం జరిగిన విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు చెప్పి సాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ముఖ్యనేత ఒకరు ఈ కేసును రహస్యంగా నమోదు చేసి చోరీ అయిన సొత్తు రికవరీ చేయించాలని సూచించినట్లు తెలిసింది. సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి.. అనంతరం టాస్క్‌ఫోర్స్ విభాగానికి బదిలీ చేశారు. నిందితుడి కోసం వేట కొనసాగించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో నిందితుడు తలదాచుకున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి బిస్వాస్‌ను అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. నిందితుడు బంగారు నగలతోపాటు చాలా మొత్తంలో నగదు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అసలే నగదుకు సంబంధించిన లెక్కలు ఏవీ లేకపోవడంతో ఐఏఎస్ అధికారి కూడా కిమ్మనకుండా అతడి వద్ద నుంచి పోలీసులు రికవరీ చేసిన దానితోనే సంతృప్తి చెందినట్లు సమాచారం. అంతా రహస్యమే.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చోరీ జరిగింది. భారీ స్థాయిలో నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. కానీ, ఆయన తూతూ మంత్రంగా కేసు ఎందుకు పెట్టినట్లు? నిందితుడి నుంచి పోలీసులు రికవరీ చేసిన సొత్తు కూడా అంతంత మాత్రమే అని తెలిసినా ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. బంగారు ఆభరణాలకు సంబంధించిన లెక్కలు చూపినా.. పెద్ద ఎత్తున ఇంట్లో ఉంచుకున్న నగదు గురించి చెప్పేదెలా? ఒకవేళ చెబితే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. అదేసమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంతో పైస్థాయిలో పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి సిఫార్సులు రావడంతో చేసేదేమీ లేక పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి.. చోరీ సొత్తును రికవరీ చేసి మూడో కంటికి తెలియకుండా నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. చోరీ జరిగిన ఘటనపై ‘సాక్షి’ పోలీసు అధికారులను వివరాలు కోరగా.. అందరి వద్ద నుంచీ ఆ కేసు వివరాలు తెలియదనే సమాధానం రావడం విశేషం. -
హంపి ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
హొస్పేట,న్యూస్‌లైన్ : ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న హంపి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని జిల్లాధికారి ఆదిత్య ఆమ్లాన్ బి స్వాస్ తెలిపారు. శనివారం ఆయన జి ల్లాలో హంపి ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం విలేకరులతో మా ట్లాడారు.దాదాపు రూ.7కోట్ల వ్య యం తో హంపి ఉత్సవాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలకు నాలుగు వేదికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన వేదికగా శ్రీకృష్ణదేవరాయ వేదిక, ఎంపీ ప్రకాష్‌వేదిక, విద్యారణ్యవేదిక, అక్కాబుక్కా వేదికల్లో మూడు రోజులు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో హంపి బై స్కై (ఆకాశం)కు ప్రయాణం చేసేందుకు (హెలికాప్టర్ ద్వారా) హంపి, సండూరు, టీబీడ్యాంను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హంపి బైస్కై వీక్షించేందుకు మూడు హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దలకు రూ.2 వేల, 10 సంవత్సరాలు లోపు ఉన్న చిన్నారులకు రూ.1500 లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. హంపి ఉత్సవాలకు వచ్చే వీవీఐపీలు, రాజకీయనేతలకు, కళాకారులకు వసతి సౌకర్యం కల్పించామన్నారు .హంపి ఉత్సవాలు వీక్షించే పర్యాటకులకు రాత్రి పూటభోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు చోట్లు భోజన వసతి ఉంటుందన్నారు. భోజనాలకు రూ.5లు వసూలు చేస్తున్నామన్నారు. జిల్లా నుంచి రాష్ట్రం, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.10వ తేది సాయంత్రం శ్రీ కృష్ణదేవరాయ వేదికలో హంపి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉత్సవాలను ’ప్రారంభిస్తారని తెలిపారు. అదే విధంగా ముఖ్య అతిథులుగా పర్యాటక శాఖమంత్రి దేశ్‌పాండే, ఇతర మంత్రులు, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా వస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ముగ్గులు పోటీలతో పాటు, గ్రామీణ క్రీడలు ఉంటాయన్నారు. ఈ సారి ముఖ్యంగా వికలాంగులకు కూడా క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. హంపిలో నాలుగు ప్రధాన వేదికలకు, స్మారకాలకు విద్యుత్‌దీపాలంకరణ చేస్తామన్నారు. ఉత్సవాలకు వీక్షించేందుకు వచ్చే వారికి అదనంగా బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్, హొస్పేట అసిస్టెంట్‌కమిషనర్ సునిల్‌కుమార్ పాల్గొన్నారు.