భక్త రామదాసు జయంత్యుత్సవాలు ప్రారంభం | Bhakta Ramadasu Jayanti Celebrations | Sakshi
Sakshi News home page

భక్త రామదాసు జయంత్యుత్సవాలు ప్రారంభం

Published Tue, Jan 31 2017 11:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాముడి ప్రీతిపాత్రుడైన భక్త రామదాసు 384వ జయంత్యుత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాముడి ప్రీతిపాత్రుడైన భక్త రామదాసు 384వ జయంత్యుత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం అభిషేకం అనంతరం సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను చిత్రకూట మండపంలోకి తీసుకొచ్చారు. మంగళహారతులు ఇచ్చిన అనంతరం జయంత్యుత్సవాలను ప్రారంభించారు.
 
నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత కార్యక్రమాలు ఉంటాయని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్వాంసులు, కళాకారులు భక్త రామదాసు కీర్తనలను భక్తిభావంతో ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు శ్రీ చక్ర సిమెంట్స్‌ అధినేత నెంద్రగంటి కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement