సోదరులే కీచకులైతే..! | Brothers rape 17-year-old girl in New Delhi | Sakshi
Sakshi News home page

సోదరులే కీచకులైతే..!

Published Sat, Mar 7 2015 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

Brothers rape 17-year-old girl in New Delhi

న్యూఢిల్లీ: సోదరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 17 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఢిల్లీ శివార్లలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కుటుంబంలో చిచ్చు పెట్టడానికే తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. కానీ, వరుసకు సోదరులైన(పినతల్లి కుమారులు) ఇద్దరు గత కొన్ని వారాలుగా తనపై అత్యాచారం చేశారని బాలిక అంటోంది. అంతేకాక ఈ సంఘటనంతా చిన్న సోదరుడు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు చెస్తోంది. దీంతో జరిగిందంతా ఆమె తన తల్లికి చెప్పడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విజయ్‌విహార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని డీసీపీ విక్రమ్‌జిత్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement