ప్రియుడిపై పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు | Case against a cheating boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడిపై పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు

Published Mon, Sep 8 2014 10:14 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

ప్రియుడిపై పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు - Sakshi

ప్రియుడిపై పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు

చెన్నై : ప్రియురాలు ఫిర్యాదు చేయడంతో వివాహ నిశ్చయమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. యువతికి ఆమె మేనమామ కుమారుడితో విరుదాలచం ఆలయంలో వివాహం జరిపించారు. కడలూరు జిల్లా శ్రీ మూష్ణం ప్రాంతానికి చెందిన ఆరుముగం కుమార్తె లక్ష్మి(28). చెన్నైలో నర్సుగా పనిచేస్తుంది. ఈమె, ప్రైవేటు బ్యాంకు జ్యువెలరీ అప్రైజర్ గణేష్(28) ప్రేమించుకున్నారు. గణేష్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు.
 
 ఈ క్రమంలో విరుదాచలంలో మరొక యువతితో వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. విషయం తెలిసి ప్రియురాలు లక్ష్మి చెన్నై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లక్ష్మితో పాటు విరుదాచలం వచ్చి గణేష్‌ను విచారణ కోసం చెన్నైకు తీసుకెళ్లి అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో గణేష్‌కు నిశ్చయించిన పేరియకాప్పాన్‌కులం గ్రామానికి చెందిన జయపాల్ కుమార్తె రంజితను విషయం తెలిసి బంధువులు ఆమె మేనమామ శిఖామణి కుమారుడు ప్రబలదాస్(28)తో నిశ్చయించిన ముహూర్తానికే మనబాల నల్లూరులో గల కొలుంజియప్పర్ ఆలయంలో వివాహం జరిపించారు. వధూవరులను బంధువులు, స్నేహితులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement