కాంగ్రెస్ నేతలకు ఆ అర్హత లేదు: హరీశ్ | Congress has no right to claim irrigation projects, says harish rao | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతలకు ఆ అర్హత లేదు: హరీశ్

Published Tue, Nov 8 2016 3:50 PM | Last Updated on Fri, Aug 30 2019 8:17 PM

కాంగ్రెస్ నేతలకు ఆ అర్హత లేదు: హరీశ్ - Sakshi

కాంగ్రెస్ నేతలకు ఆ అర్హత లేదు: హరీశ్

కరీంనగర్ : తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు...కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలకు ప్రాజెక్టులపై మాట్లాడే హక్కులేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.700 కోట్లు పంపిణీ చేస్తే...రెండేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ రూ.400 కోట్లు పంపిణీ చేసిందని అన్నారు.

ఇక మిడ్ మానేరు నిర్వాసితులకు కుటుంబ పరిహారం కింద రూ.2 లక్షల చొప్పున త్వరలోనే అందచేస్తామన్నారు. ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇస్తే 123 జీవో ప్రకారం 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని హరీశ్ తెలిపారు. 2018వరకు ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement