రజనీతో కాంగ్రెస్‌ నేత భేటీ | Congress leader meets Rajanikanth | Sakshi
Sakshi News home page

రజనీతో కాంగ్రెస్‌ నేత భేటీ

Published Sat, Apr 22 2017 8:22 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

రజనీతో కాంగ్రెస్‌ నేత భేటీ - Sakshi

రజనీతో కాంగ్రెస్‌ నేత భేటీ

► రాజకీయ వర్గాల్లో కలకలం

తమిళసినిమా: రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు తిరునావుక్కరసు శుక్రవారం రజనీకాంత్‌తో భేటీ అయ్యారు. కొంత కాలంగా రజనీకాంత్‌ను తమ పార్టీలోకి లాగడానికి పలువురు రాజకీయ నాయకులు గాలం వేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ అభ్యర్థిగా ఆర్కేనగర్‌ అసెంబ్లీ బరిలో దిగిన సంగీత దర్శకుడు గంగై అమరన్‌ రజనీకాంత్‌తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో  కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్‌ నాయకుడు తిరునావుక్కరసు రజనీకాంత్‌తో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో వేడిపుట్టించింది. అయితే తన కుటుంబంలో జరగనున్న ఒక వేడుకలో పాల్గొనాల్సిందిగా రజనీకాంత్‌ను ఆహ్వానించడానికే తిరునావుక్కరసు ప్రత్యక్షంగా రజనీని కలిసి ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement