'డిండి' పై పూటకో మాట: వంశీచంద్ రెడ్డి
Published Tue, Apr 4 2017 3:34 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకం ఫై ప్రభుత్వం పూటకో మాట చెబుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2007లో జీవో ఇచ్చింది.. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వాలని రూపకల్పన చేశారు. దీని వల్ల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సాగుకు నష్టం జరుగుతుందన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు నర్లపూర్ నుంచి కాకుండా సెపరేట్ గా తీసుకపోవాలన్నారు. డిండి ఎత్తిపోతలఫై మహబూబ్ నగర్, నల్గొండ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Advertisement