కొరడా | court noted that, despite provisions buildings until 1999, was ordered | Sakshi
Sakshi News home page

కొరడా

Published Tue, Feb 11 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

court noted that, despite provisions buildings until 1999, was ordered

సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని నగరంలో సీఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా అనేక భవనాలు వెలిశాయి. వీటి భరతం పట్టేలా కార్పొరేషన్, సీఎం డీఏ వర్గాలు తరచూ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదు. ఏదేని చిన్న పాటి ప్రమాదం జరిగినా తప్పించుకోలేని రీతిలో మాల్స్‌ను నిర్మించారు. గతంలో ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. దీనిపై అప్పట్లో కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నిర్మించిన భవనాల్ని కూల్చి వేయూలని ఆదేశిం చింది. దాన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఈ వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ సం ఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. 
 
 పిటిషన్ దాఖలు 
 1999 వరకు నిబంధనలకు విరుద్ధం గా నిర్మితమైన భవనాల్ని కూల్చి వేయాలని కోర్టు ఆదేశించినా అమలు కాలేదని గుర్తుచేశారు. డీఎంకే హాయూంలో మోహన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన  సూచనల మేరకు ఆ భవనాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. 2007 వరకు నిబంధనల్ని ఉల్లంఘించి నిర్మించిన భవనాల్ని క్రమబద్ధీకరిస్తున్నట్టు, జరిమానాలు విధిస్తున్నట్టు, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఊరట ఇచ్చే విధంగా ఉత్తర్వులు వెలువడ్డాయని వివరించారు. వాటిని రద్దు చేసి నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝుళిపించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ట్రాఫిక్ రామస్వామి తరపు న్యాయవాదులు, అధికారుల వాదనల్ని విన్న బెంచ్ గత వారం విచారణను ముగించింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది.
 
 ఆ మేరకు ఉదయం బెంచ్ తీర్పు వెలువరించింది. ఇది వరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నిబంధనల్ని ఉల్లంఘించి నగరంలో పుట్టగొడుగుల్లా భవనాలు వెలుస్తున్నాయని బెంచ్ వివరించింది. అన్ని కోణాల్లో పరిశీలించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, కొందరి ప్రయోజనాలను మాత్రం దృష్టిలో ఉంచుకోకూడదని అక్షింతలు వేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ దృష్ట్యా నిబంధనల్ని ఉల్లంఘించిన భవనాలపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉందని తీర్పు వెలువరించింది. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement