'అమరావతిని ఫ్రీజోన్ చేయాలి'
అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద శనివారం మహాధర్నా చేపట్టారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతిని ఫ్రీజోన్ చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించాలని సీపీఐ రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.