నేడు ఢిల్లీ ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు
Published Tue, Dec 3 2013 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. కాగా, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఓటుహక్కు వినియోగించుకునే నిమిత్తం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆయా యాజమాన్యాలకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలో అన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యాలయాలు బుధవారం మూతపడతాయి. ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.
Advertisement
Advertisement