న్యూఢిల్లీ: నగరంలో మరో ఐదుగురు స్వైన్ ఫ్లూ బాధితులను గుర్తించినట్లు మంగళవారం వైద్యులు తెలిపారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరిలో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా, ఒక మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి చరణ్ సింగ్ తెలిపారు. ఈ వ్యాధి మరింత విజృంభించే అవకాశముందన్నారు. ముఖ్యంగా వృద్ధు లు, కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడేవారు, కేన్సర్ రోగులు, గర్భిణులకు ఈ వ్యాధి తొందరగా సోకే అవకాశముందని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్తలతోపాటు వ్యాక్సిన్‌ను కూడా వీరు తీసుకుంటే వ్యాధికి దూరంగా ఉండొచ్చని సూచించారు. ఐదు రోజుల్లోనే 14 కేసులు నమోదయ్యాయన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నగరంలో స్వైన్‌ఫ్లూ మందులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు.
మరో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు
Published Wed, Jan 7 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement