పార్టీ ప్రయోజనాలే ముఖ‍్యం: చంద్రబాబు
విజయవాడ: పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే సహించేది లేదని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మంత్రి వర్గ విస్తరణపై ఏదైనా ఉంటే తనతో నేరుగా చెప్పాలని ఆయన అన్నారు. సోమవారం ఉదయం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకన్ఫరెన్స్ నిర్వహించారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు.
మంత్రి వర్గంలో 26 మందికి మించి స్థానం కల్పించలేమన్నారు. అందువల్లఏ అన్ని ప్రాంతాల వారికి పాతినిధ్యం కల్పించాల్సి వచ్చిందన్నారు. కొందరికి అర్హత ఉన్నా ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే సహించనన్నారు. ప్రజలు బాగుండాలంటే పార్టీ కూడా బాగుండాలని అన్నారు.