అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published Fri, Sep 30 2016 12:07 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
బిక్నూరు: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండలం కాచేపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంగెపు బీరయ్య(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారిలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement