కరీంనగర్‌లో రైతుల ఆందోళన
Published Thu, Apr 27 2017 11:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది, లక్ష్మీపూర్, రంగంపేట వరిధాన‍్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన‍్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం సరిగా లేదని సాకు చెబుతూ కొనేందుకు నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన రైతులు వరి ధాన్యానికి నిప్పుపెట్టి ఆందోళన చేపట్టారు. వ‍్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సాకులు చెబుతూ ధాన‍్యం కొనుగోలును ఆపేశారు. దాంతో రైతులు ధర్నాకు దిగారు.
Advertisement
Advertisement