ప్రియుడితో పండుగ | Feroz Vijaya Lakshmi pandaga movie | Sakshi
Sakshi News home page

ప్రియుడితో పండుగ

Published Sat, Jun 13 2015 2:36 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

ప్రియుడితో పండుగ - Sakshi

ప్రియుడితో పండుగ

ప్రియుడితో పండగకు సిద్ధమైంది నటి విజయలక్ష్మి. అయితే ఈ పండుగలో మేమున్నాం అంటున్నారు నటుడు కృష్ణ, నటి ఆనంది. విషయం ఏమిటంటే నటిగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నటి విజయలక్ష్మి నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు ఇంతకుముందే వెల్లడించిన విషయం విదితమే. అన్నట్లు ఈ చెన్నై - 28 చిన్నది దర్శకుడు అగస్థ్యన్ కూతురన్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రేమలో పడ్డ ఈ బ్యూటీ పనిలో పనిగా తన ప్రియుడు ఫెరోజ్‌ను దర్శకుడుగా పరిచయం చేసింది.
 
 ఆయన దర్శకత్వంలో విజయలక్ష్మి నిర్మించే చిత్రానికి పండుగై (పండుగ) అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో యువ నటుడు కృష్ణ హీరోగాను, నటి నందిని హీరోయిన్‌గాను నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గురువారం మొదలైంది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసి నిర్మిస్తున్న చిత్రం పండుగై అని పేర్కొంది. చట్ట విరోధ కార్యక్రమాలు నిర్వహించే వారి మధ్య పోరాటమే పండుగై అని తెలిపింది. అయితే చిత్రంలో కామెడీ, రొమాన్స్ సన్నివేశాలకు కొరత ఉండదని చెప్పింది. దీనికి జాతీయ అవార్డు గ్రహీత సోబుజోసఫ్ ఎడిటింగ్‌ను తన సోదరి నిరంజని అగస్థ్యిన్ కాస్టూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement