విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొంగవానిపాలెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
Published Tue, Mar 28 2017 1:47 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొంగవానిపాలెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామస్తులంతా కూలీ పనులకు వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. సుమారు 26 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలోని నగలు, నగదు, విలువైన పత్రాలు బూడిదయ్యాయి. గ్రామస్తులు కట్టుబట్టలతో మిగిలారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందని బాధితులు తెలిపారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేపట్టామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.
Advertisement
Advertisement