రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి దుర్మరణం | Former MLA and son died in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి దుర్మరణం

Published Thu, Mar 5 2015 1:46 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Former MLA and son died in a road accident

బెంగళూరు(బనశంకరి) :  బెంగళూరు నుంచి హిరియూరుకు వెళుతున్న కారు తాలూకాలోని జవగొండనహళ్లి వద్ద బోల్తాపడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వివరాలు..... హొసదుర్గ మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ కుమారుడు అరవింద్ (44) బెంగళూ రు నుంచి మంగళవారం కారును డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు స్నేహితులతో కలిసి వెళుతున్నారు. హిరియూరు తా లూకా జవగొండనహళ్లి వద్ద రాత్రి 11.30 సమయంలో గాలికి ఎగిరిన టార్పల్ కారు ముందుభాగం గాజుకు చుట్టుకుంది. వెంటనే కారు నడుపుతున్న అరవింద్ తక్షణమే వాహనాన్ని నిలపడానికి ప్రయత్నించినా అతివేగం గా వెళుతున్న కారు నియంత్రణ కో ల్పోయి రోడ్డు వదిలి పక్కకు బోల్తాకొట్టింది.

ఈ ప్రమాదంలో అరవింద్ అక్కడికక్కడే మృతిచెందాడు. జతలో ఉన్న ఇద్దరు స్నేహితులకు తీవ్రగాయా లు కావడంతో ఒకరిని హిరియూరు ఆస్పత్రికి తరలించగా, మరొకరిని బెం గళూరు ఆస్పత్రికి తరలించారు. వీరి ద్దరు పేర్లు నివాసం తెలియడం లేదు.సంఘటనా స్ధలానికి హిరియూరు పో లీసులు చేరుకుని పరిశీలించిన అనంతరం వృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement