
‘మిసైల్ మ్యాన్’కు నివాళి
దివంగత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాంకు గురువారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఉభయ సభలు నివాళులర్పించాయి. ఒక నిమిషం పాటు మౌనం పాటించడం ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, ఒక సామాన్య వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి, భారతరత్న పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగడంతో పాటు యువతలో స్ఫూర్తిని నింపిన దార్శనికుడిని కోల్పోవడం నిజంగా దురృష్టమని ఈ సందర్భంగా సభ్యులు వ్యాఖ్యానించారు. - సాక్షి, బెంగళూరు