చెన్నై, సాక్షి ప్రతినిధి: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన సంఘటన మదురైలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం మదురైలోని ఎల్లీస్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అహ్మద్ (46), భార్య సజితా (34) దంపతులకు 11 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన సజితా కాన్పు కోసం ఈనెల 29వ తేదీన మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి, 30వ తేదీన ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. పిల్లల తండ్రి అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గతంలో తన భార్య మూడోసారి గర్భం దాల్చగా 13వ వారంలో చక్కెరవ్యాధి, హృద్రోగ సమస్యలు తలెత్తడంతో అబార్షన్ చేయించి గర్భ సంచిని కూడా తొలగించాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే మరో బిడ్డకావాలనే ఆశతో టెస్ట్‌ట్యూబ్ విధానంలో తన భార్య మళ్లీ గర్భం దాల్చి నలుగురు బిడ్డలను కనడం మాటలకు అందని ఆనందంగా ఉందని అన్నాడు.
ఒకే కాన్పులో నలుగురు
Published Wed, Apr 1 2015 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement
Advertisement