single Delivery
-
ఒకే కాన్పు లో నలుగురు శిశువుల జననం
ఖమ్మం: మనం మామూలుగా ఒక కాన్సులో ఒకరు లేదా ఇద్దరు మహా అయితే ముగ్గురు శిశువులు జన్మించారని విన్నాం. అయితే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్సులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. తిరుమలాయపాలెం మండలానికి చెందిన శామీన అనే మహిళ పురిటినొప్పులతో స్థానిక జోయా ఆస్పత్రిలో చేరింది. ఆమెకు శ స్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు నలుగురు శిశువులు జన్మించిన్లు తెలిపారు. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని, చిన్నారుల్లో ముగ్గురు మగశివువులతో పాటు ఆడబిడ్డ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. -
ఒకే కాన్పులో నలుగురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన సంఘటన మదురైలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం మదురైలోని ఎల్లీస్నగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అహ్మద్ (46), భార్య సజితా (34) దంపతులకు 11 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన సజితా కాన్పు కోసం ఈనెల 29వ తేదీన మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి, 30వ తేదీన ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. పిల్లల తండ్రి అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గతంలో తన భార్య మూడోసారి గర్భం దాల్చగా 13వ వారంలో చక్కెరవ్యాధి, హృద్రోగ సమస్యలు తలెత్తడంతో అబార్షన్ చేయించి గర్భ సంచిని కూడా తొలగించాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే మరో బిడ్డకావాలనే ఆశతో టెస్ట్ట్యూబ్ విధానంలో తన భార్య మళ్లీ గర్భం దాల్చి నలుగురు బిడ్డలను కనడం మాటలకు అందని ఆనందంగా ఉందని అన్నాడు. -
ఒకే కాన్పులో ముగ్గురు జననం:తల్లీపిల్లలు క్షేమం
తూ.గో: ఒకే కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పుట్టడం సహజం. ముగ్గురు జన్మించడం అనేది అరుదుగా జరుగుతుంది. అటువంటి సంఘటనే తాజాగా జిల్లాలోని మల్కిపురం నళిని ఆస్పత్రిలో సోమవారం సంభవించింది. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. పిల్లల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యంనే ఉన్నట్లు తెలిపారు.