న్యూఢిల్లీ: నగర విద్యావ్యవస్థలోకి మరో కొత్త యూనివర్సిటీ వచ్చిచేరింది. కొందరు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల చొరవతో ఉన్నత విద్యకోసం ఏర్పాటు చేసిన అశోకా యూనివ ర్సిటీ ఉదాత్త కళల్లో నాలుగేళ్ల అండర్ డిగ్రీ (ఎఫ్‌వైయూపీ) ఆఫర్ చేస్తోంది. ఆగస్టు నుంచి దీనికి ప్రవేశాలు జరగనున్నాయి. పరిశీలనతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని నేర్పగలిగే ఇలాంటి కోర్సులే ఢిల్లీ యూనివర్సిటీలోనూ ఉన్నాయి. ప్రపంచ ంలోనే పేరుగాంచిన హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, యేల్, కార్నెల్ యూనివర్సిటీల స్థాయిలో ఈ విశ్వవిద్యాలయం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తోందని, యూఎస్ సరళీకృత విద్యావ్యవస్థ ప్రాతిపదికనే ఇవి రూపొందించామని వ్వవస్థాపకులు చెబుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వ్యవస్థపాకుల్లో ఒకరు, మొట్టమొదటి డీన్ అయిన ప్రమథ్ రాజ్ సిన్హా ఈ యూనివర్సిటీ స్థాపనలో కీలక భూమిక పోషించారు.
ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు. చాలా భారతీయ విశ్వవిద్యాలయాల్లో లాగా మూడేళ్ల డిగ్రీ వల్ల విద్యార్థులు విషయాన్ని లోతుగాఅర్థం చే సుకోలేకపోతున్నారని, అందుకోసం నాలుగేళ్ల డిగ్రీని అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన తెలిపారు. ‘‘నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోసం వేలమంది విద్యార్థులు అమెరికా, లండన్ లాంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ఎందుకు ఆ కోర్సులను నాలుగేళ్లు అందించలేము? భారతీయ విద్యావ్యవస్థలో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉంది’’ అంటున్నారు సిన్హా. అయితే ఇప్పటికే ఢిల్లీ యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టిన నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్స్‌పై వివాదంలో ఉంది. కొందరు టీచర్లు, విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల ఒక విలువైన సంవత్సరాన్ని వృథా చేసే ఈ కోర్సును తీసేస్తామని బీజేపీ తన ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం.
ఢిల్లీ శివార్లుల్లోని కుంద్లీలో హర్యానాకు దగ్గరా ఉన్న రాజీవ్‌గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో 25 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఖర్చు 20 లక్షలు. భారతదేశంలో ఉన్న లిబరల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్‌లో అన్నింటికన్న ఖరీదైన డిగ్రీ ఇది. ఇందులో సగం మంది విద్యార్థులకు 25 శాతంనుంచి 100శాతం వరకు స్కాలర్‌షిప్స్ ఇస్తున్నారు. ఆగస్టు ఒకటినుంచి 350 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ప్రారంభమవుతోంది. మిచిగాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, కార్లెటాన్ కాలేజ్, సెన్సైస్ పో వంటి యూనివర్సిటీల సహకారం కోసం చర్చలు కొనసాగుతున్నాయని యూనివర్సిటీ తెలిపింది.
మరో యూనివర్సిటీలో ఎఫ్‌వైయూపీ
Published Thu, Apr 17 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement
Advertisement