ఎఫ్‌వైయూపీ కోర్సులపై డీయూటీఏ ధర్నా | DUTA calls on V-C to restructure course for 2013 FYUP batch | Sakshi
Sakshi News home page

ఎఫ్‌వైయూపీ కోర్సులపై డీయూటీఏ ధర్నా

Published Tue, Jul 8 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఎఫ్‌వైయూపీ కోర్సులపై డీయూటీఏ ధర్నా

ఎఫ్‌వైయూపీ కోర్సులపై డీయూటీఏ ధర్నా

న్యూఢిల్లీ: నాలుగేళ్ల డిగ్రీ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డీయూటీఏ) మంగళవారం ధర్నాకు దిగింది. నాలుగేళ్ల డిగ్రీకి సంబంధించిన కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాలని డీయూటీఏ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఢిల్లీ యూనివర్సిటీ నిర్లక్ష్యంగా, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని, యూజీసీ సూచించినట్లుగా అవసరమై అనుమతుల కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదని డీయూటీఏ ప్రెసిడెంట్ నందితా నరైన్ ఆరోపించారు. ఈ విషయంలో నియమించిన సలహాదారుల కమిటీని పొడిగించడాన్ని అసోసియేషన్ స్వాగతిస్తోందని, జూలై 21లోపు నాలుగేళ్ల డిగ్రీకి సంబంధించిన సమస్యలను ఈ కమిటీ పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని నరైన్ పేర్కొన్నారు. కోర్సుల పునర్‌వ్యవస్థీకరణ విషయమై కమిటీకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఇప్పటికే కొన్ని సూచనలు కూడ చేశామన్నారు. ఈ కమిటీ సిఫారసులను యూనివర్సిటీ అమలు చేస్తుందని ఆశాభావ ం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement