చెన్నై ,తిరువొత్తియూరు: ఫ్రాన్స్ దేశానికి చెందిన దంపతులు చెన్నై గిండి ప్రాంతంలో ఆటోలో తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని హోటల్‌కు పంపించారు. గిండి క్రైం విభాగం ఇన్‌స్పెక్టర్ కన్నన్, పోలీసులు గిండి ఆల్టా ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా విదేశీ దంపతులు ఆటోలో వస్తున్నట్టు సమాచారం అందింది. ఆ మార్గంలో వచ్చిన ఆటోను నిలిపి తనిఖీ చేయగా అందులో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఏసీ(40), అతని భార్య మరియ(28) ఉన్నారు. వారిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించారు. వారు జనవరి 26వ తేదీ ముంబయి విమానాశ్రయానికి వచ్చారని, అక్కడి నుంచి గోవాకు వెళ్లారని గుర్తించారు. తర్వాత సొంతంగా ఆటో తీసుకుని మైసూరు, బెంగళూరు, కోవై, ఊటీ, కొడైక్కెనాల్‌లో తిరిగి చెన్నై వచ్చినట్టు తేలింది. 144 సెక్షన్ అమలులో ఉందని, బయట తిరగవద్దని వారికి సూచించి హోటల్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment