న్యూఢిల్లీ: నగరంలోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సురేందర్ ప్రకాశ్‌శర్మ పోటీ చేయనున్నారు. పార్టీ ఢిల్లీ విభాగం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పీసీ చాకో మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నియోజక వర్గం నుంచి 2013 నాటి ఎన్నికల్లో పోటీచేసిన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ విజయం సాధించిన సంగతి విదితమే. ఇక రాజౌరీ గార్డెన్ నియోజకవర్గం నుంచి మీనాక్షి చండేలియా బరిలోకి దిగనున్నారు. ఢిల్లీ విధానసభకు వచ్చే నెల ఏడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు విమర్శనా స్త్రాలను సంధించుకుంటున్నాయి.
గాంధీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్
Published Tue, Jan 20 2015 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM
Advertisement
Advertisement